Champai Soren Join BJP: కమలం గూటికి చంపై సోరెన్..కండువా కప్పుకునేది అప్పుడే.. కన్ఫమ్ చేసి అసోం సీఎం

Champai Soren Join BJP Former Assam CM Champai Soren will join BJP on August 30
x

Champai Soren Join BJP: కమలం గూటికి చంపై సోరెన్..కండువా కప్పుకునేది అప్పుడే.. కన్ఫమ్ చేసి అసోం సీఎం

Highlights

Champai Soren Join BJP : జార్ఖండ్ మాజీ సీఎం ఔజ్ జేఎంఎం నేత చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చంపాయ్ బీజేపీలో చేరే తేదీని అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ కూడా వెల్లడించారు.

Champai Soren Join BJP : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ఎట్టకేలకు తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్నారు. చంపై సోరెన్ బీజేపీలో చేరబోతున్నారు. గత కొన్ని రోజులుగా హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చాపై మాజీ సిఎం చంపై సోరెన్ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లోపు చంపై సోరెన్‌తో కలసి రావడం ద్వారా బిజెపికి మంచి ప్రయోజనం చేకూరనుంది.

సోమవారం హోంమంత్రి అమిత్ షాతో చంపాయ్ సోరెన్ భేటీ అయ్యారు. ఆయన వెంట అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ కూడా ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మన దేశంలోని ప్రముఖ గిరిజన నేత చంపాయ్ సోరెన్ కొంతకాలం క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని సీఎం హిమంత తెలియజేశారు. ఆగస్టు 30న రాంచీలో చంపాయ్ అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

కాగా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని చంపై సోరెన్ ఇటీవలే చెప్పారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చంపాయ్ సోరెన్ గతంలో చెప్పారు.భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త సీఎంగా నియమితులయ్యారు.

జార్ఖండ్ హైకోర్టు నుండి బెయిల్ పొందిన తరువాత, హేమంత్ సోరెన్ మళ్లీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం చంపై సోరెన్‌ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. కొన్ని రోజుల తర్వాత, చంపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేతలను కలవటం వల్ల పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే చంపయి శుక్రవారం బీజేపీలోకి చేరుతున్నారని అసోం ముఖ్యమంత్రి బిశ్వశర్మ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories