Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేశారా.. కొత్త నిబంధనలు ఏంటో తెలుసా..?

Centre Notifies New Rules No Need of Driving Test to Get Driving License | Telugu Online News
x

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేశారా.. కొత్త నిబంధనలు ఏంటో తెలుసా..?

Highlights

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలని మార్చింది...

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలని మార్చింది. అయినా ఈ విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇంకా పాత పద్దతిలోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎలా తీసుకోవాలా ఆలోచిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రజలు ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) సందర్శించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ను చాలా సులభతరం చేసింది. ప్రభుత్వం ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం.

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. కొత్త రూల్ ప్రకారం.. ఇప్పుడు మీరు RTO ఆఫీసు వద్దకు వెళ్లి ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. ఈ నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. మారిన నిబంధనలు డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త మార్పు వల్ల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కోట్లాది మందికి ఊరట లభించినట్లయింది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO వద్ద పరీక్ష కోసం వేచి ఉన్న దరఖాస్తుదారులందరు ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ పాఠశాలలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవాలి. అక్కడ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ నుంచి శిక్షణ పొందాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు దరఖాస్తుదారులకు పాఠశాల ద్వారా సర్టిఫికేట్ అందుతుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తుదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. శిక్షణా కేంద్రాలకు సంబంధించి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నుంచి కొన్ని మార్గదర్శకాలు, షరతులు ఉంటాయి. ఇది శిక్షణా కేంద్రాల ప్రాంతం నుంచి శిక్షకుడి విద్య వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని వివరాలు ఉంటేనే కేంద్రం డ్రైవింగ్‌ స్కూల్‌కి అనుమతి ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories