కరోనా స్ట్రెయిన్‌పై కేంద్రం కీలక ప్రకటన

కరోనా స్ట్రెయిన్‌పై కేంద్రం కీలక ప్రకటన
x
Highlights

కరోనా స్ట్రెయిన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు జినోమ్‌ సీక్వెన్సింగ్ తప్పనిసరని స్పష్టం చేసింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం...

కరోనా స్ట్రెయిన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు జినోమ్‌ సీక్వెన్సింగ్ తప్పనిసరని స్పష్టం చేసింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 10 ప్రభుత్వ ల్యాబ్‌ల ఏర్పాటు చేశామని వైద్యాధికారులు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి 22 వరకు వచ్చిన ప్రయాణికులకు టెస్టులు తప్పనిసరని తేల్చిచెప్పారు. స్ట్ర్రెయిన్‌పై వాక్సిన్‌ ప్రభావం ఉండదనడానికి ఆధారాలు లేవని కేంద్ర వైద్యఆరోగ్యశా‌ఖ అధికారులు తెలిపారు.

బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ రావడానికి ముందు, దేశంలోని వివిధ ల్యాబ్‌లలో సుమారు 5,000 కరోనా వైరస్ జన్యు క్రమాలను పరిశీలించామని ఇప్పుడు ఆ సంఖ్యను గణనీయంగా పెంచామని అధికారులు తెలిపారు. రాష్ట్రాలతో కలసి సమన్వయంతో పని చేస్తామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories