Delhi: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. షేక్‌ హసీనాకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం

Centre Hold All Party Meeting on Bangladesh Situation
x

Delhi: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. షేక్‌ హసీనాకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం

Highlights

All Party Meeting: పార్లమెంట్‌ భవన్‌లో అఖిలపక్ష సమావేశం ముగిసింది.

All Party Meeting: పార్లమెంట్‌ భవన్‌లో అఖిలపక్ష సమావేశం ముగిసింది. బంగ్లాదేశ్‌ పరిస్థితులను, షేక్‌హసీనాకు ఆశ్రయం కల్పించడంపై అఖిలపక్ష నేతలకు వివరించారు జైశంకర్‌. సరిహద్దుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపింది అఖిలపక్షం. షేక్‌ హసీనాకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. ఈ భేటీకి అధికార పక్షం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌గాంధీ, వేణుగోపాల్‌తోపాటు, ఎస్​పీ, టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు.

సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశమై, అక్కడ పరిస్థితులను సమీక్షించింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories