మారటోరియం పొడిగింపుపై కేంద్రం, ఆర్‌బీఐ క్లారిటీ

మారటోరియం పొడిగింపుపై కేంద్రం, ఆర్‌బీఐ క్లారిటీ
x
Highlights

రుణ మారటోరియం సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) , కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఇక మీదట మారటోరియం పొడిగించడం..

రుణ మారటోరియం సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) , కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఇక మీదట మారటోరియం పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. మారటోరియం ఆరు నెలలకు మించి ఇవ్వడం దేశ ఆర్ధిక ప్రయోజనాలకు ప్రమాదమని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అంతకుముందు, అక్టోబర్ 2 న జరిగిన విచారణలో, రూ .2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ మీద వడ్డీని మాఫీ చేయడానికి కేంద్రం సంసిద్ధతను వ్యక్తం చేసినా.. కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో క్రెడాయ్ లాంటి సంఘాల వాదనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.

ఇదే క్రమంలో కేంద్రం, ఆర్బీఐ మాత్రం రూ.2 కోట్ల రుణంపై వడ్డీని వదులుకోవడం మినహా ఏదైనా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి ప్రమాదకరమని పేర్కొన్నాయి. మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపులపై ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ కోర్టుకు తెలిపింది. అంతేకాదు ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా చెప్పింది. ఇదిలావుంటే కరోనా సంక్షోభం కారణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మార్చి 27 న రుణగ్రహీతలను ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం కోసం నెలవారీ వాయిదాల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించింది. ప్రారంభంలో, ఈ నిర్ణయం మూడు నెలల కాలానికి అని చెప్పింది. కానీ 2020 ఆగస్టు 31 వరకు మరో మూడు నెలల వరకు పొడిగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories