Vaccine: టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Central new Guidelines on Vaccine Distribution
x

కరోన వాక్సిన్ (ఫైల్ ఫోటో)

Highlights

Vaccine: టీకా పంపిణీపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

Vaccine: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్‌ను తరిమికొట్టే బృహత్తర ప్రక్రియ వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్రం మరింత వేగవంతం చేసింది. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. టీకా పంపిణీపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.

ప్రైవేటు ఆసుపత్రులు, ఇండస్ట్రీలకు చెందిన ఆసుపత్రులు తదితర వాటి సహకారంతో అదనపు ప్రైవేటు కొవిడ్ వ్యాక్సిన్‌ కేంద్రాలను రిజిస్టర్‌ చేయాలని సూచించింది. ఏయే ఆసుపత్రులు ఎన్ని వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయి.. టీకా నిల్వలు, వ్యాక్సిన్‌ ధరలను కొవిన్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించింది. కొవిన్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌లను అందుబాటులో ఉంచుతూ అర్హులై వారందరికీ టీకాలు వేయాలని సూచించింది. టీకా కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా చూసే అధికారులకు పూర్తి సహకారం అందిచాలని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories