Covid Treatment: చికిత్స విధానంలో మార్పులు..లక్షణాలు కనిపిస్తే కోవిడ్ చికిత్స

Central Health Department Has Made Changes in Covid Treatment
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Covid Treatment: కోవిడ్ ఫలితాలు వచ్చే వరకు కాకుండా లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ చికిత్సను అందించాలంటూ కేంద్రం ఆదేశం

Covid Treatment: కోవిడ్ చికిత్స విధానంలో కేంద్రం మార్పులు చేర్పులు చేసింది. కోవిడ్ ఫలితాలు వచ్చే వరకు కాకుండా లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ చికిత్సను అందించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. చికిత్స ప్రారంభంలో జాప్యం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. లక్షణాలు కనిపిస్తే చాలు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితాలు వచ్చే వరకు ఆగకుండా చికిత్స చేయాలని కొన్ని గైడ్‌లైన్‌లను విధించింది.

లక్షణాలు బయట పడిన దగ్గర నుంచి కొవిడ్‌ నిర్ధారణ ఫలితం వచ్చే వరకూ కనీసం మూడు నాలుగు రోజుల సమయం పడుతుండడంతో.. ఈ జాప్యాన్ని నివారించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. స్వల్ప లక్షణాలున్న కొవిడ్‌ బాధితులకు, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా కూడా ఇవ్వాల్సిన చికిత్సలపై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ప్రస్తుతం కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నా.. అది కరోనా వైరస్‌ కాకపోయి ఉండొచ్చనే భావనతో ఎక్కువమంది కొద్దిరోజులు ఎటువంటి చికిత్స తీసుకోవడంలేదు. మరికొందరు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితం వచ్చే వరకూ వేచి చూస్తున్నారు. దాంతో చికిత్సలో జాప్యం జరిగి బాధితుల ఆరోగ్యం ఉన్నట్టుండి దిగజారుతోంది. లంగ్స్‌పై ప్రభావం పడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. అప్పుడు చికిత్స కష్టతరమవుతోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీన్ని నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను సవరిస్తూ.. నూతన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories