Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా, కేంద్రం హెచ్చరికలు

Central Health Department Covid Guidelines to States | Covid Latest News
x

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా, కేంద్రం హెచ్చరికలు

Highlights

Coronavirus: రాబోయే పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు...

Coronavirus: పండగల సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పలు రాష్ట్రాల్లోనూ, ప్రపంచంలోని వివిధ విదేశాల్లోనూ కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, మున్ముందు పండగ వేళల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు.

రాబోయే పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు, ఐదు శాతానికి మించి కొవిడ్‌ కేసులున్న జిల్లాల్లో జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

పండుగల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ... ముందుగానే ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొన్నారు. పండుగల వేళ నిర్వహించే కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాలని, ప్రతిచోటా ప్రజలు కొవిడ్‌ ప్రవర్తనతో మెలిగేలా చూడాలన్నారు. అన్నిచోట్లా నిఘా ఉంచి, అవసరమైతే తగిన శిక్ష విధించేలా చర్యలు అవసరమన్నారు. షాపింగ్‌ మాళ్లు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన ప్రమాణాల గురించి గత ఏడాది నవంబరు 30న జారీచేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. పండుగలను ఆన్‌లైన్‌లో చేసుకునే వినూత్న విధానాలను ప్రోత్సహించాలన్నారు.

మొదటి డోసు తర్వాత తగిన గడువు పూర్తయినా, ఇంకా రెండో డోసు తీసుకోని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. రెండో డోసు అందించేందుకు వీలుగా కొవిన్‌ పోర్టల్‌లోని వివరాలు సహాయపడతాయని, లైన్‌-లిస్ట్ ప్రకారం జిల్లాల వారీగా లబ్ధిదారులనుగుర్తించవచ్చని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories