Centre To Mamata Banerjee: మమతా బెనర్జీని ఇరకాటంలో పడేసేలా రిప్లై ఇచ్చిన కేంద్రం

Centre To Mamata Banerjee: మమతా బెనర్జీని ఇరకాటంలో పడేసేలా రిప్లై ఇచ్చిన కేంద్రం
x
Highlights

కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Centre To Mamata Banerjee: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు తరువాత ఆ ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. దేశంలో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు, లైంగిక దాడులు భారీగా పెరిగిపోయాయని.. మహిళలపై నేరాలను అరికట్టేందుకు దేశంలో మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె తన లేఖ ద్వారా ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

మమతా బెనర్జి రాసిన ఈ లేఖకు తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పందించారు. మమతా బెనర్జీకి స్పందిస్తూ లేఖ రాసిన అన్నపూర్ణా దేవి.. మహిళలపై నేరాల అదుపునకు కేంద్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను అందులో వివరించారు. పశ్చిమ బెంగాల్ లో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలను అదుపులో పెట్టడం కోసం మొత్తం 123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరు చేస్తే.. ప్రస్తుతం అందులో చాలావరకు ఇంకా అందుబాటులోకే రాలేదు అని కేంద్రం స్పష్టంచేసింది.

ముందుగా, కోల్‌కతా ఘటనలో చనిపోయిన ట్రైని డాక్టర్ తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి సంతాపం ప్రకటించారు. అనంతరం ప్రస్తుత అంశాలను ప్రస్తావించారు. భారతీయ న్యాయ సంహిత ఇటీవలే అందుబాటులోకి వచ్చిందని.. అది మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తుందని అన్నపూర్ణా దేవి తన లేఖలో పేర్కొన్నారు.

2019 అక్టోబర్ నుండి కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి మొత్తం 752 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. అందులో కేవలం పోక్సో కేసులను (POCSO Cases) డీల్ చేసేలా 409 ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ కోర్టులు ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 2 లక్షల 53 వేల కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడం జరిగింది అని కేంద్రం స్పష్టంచేసింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గతేడాది 17 పోక్సో కోర్టులు మంజూరు కాగా.. అందులో కేవలం 6 కోర్టులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని.. మిగతా 11 కోర్టులు అలాగే మిగిలిపోయాయని కేంద్ర మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో 48,600 రేప్ కేసులు, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఆ 11 కోర్టులను అందుబాటులోకి తీసుకురాలేదు అని తన లేఖలో హైలైట్ చేశారు. దీంతో మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా మమతా బెనర్జి లేఖ రాస్తే... తిరిగి ఆమెనే ఇరుకున పెట్టేలా కేంద్రమంత్రి రిప్లై ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories