UnEmployment: ఉద్యోగం కోల్పోతే తాత్కాలిక సాయం.. కోవిద్ ఆపత్కాలంలో కేంద్రం చర్యలు

UnEmployment: ఉద్యోగం కోల్పోతే తాత్కాలిక సాయం.. కోవిద్ ఆపత్కాలంలో కేంద్రం చర్యలు
x
Highlights

UnEmployment | కోవిద్ ప్రభావం వల్ల పలు సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది నిరుద్యోగులుగా మారారు.

UnEmployment | కోవిద్ ప్రభావం వల్ల పలు సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. వీరిలో కొంతమందిని నిర్ధాక్షిణ్యంగా తొలగించగా, మరికొంతమందిని ఇంటి వద్దే ఉండి పని కల్పించేందుకు సంస్థలు అంగీకరించాయి. మరికొన్ని సంస్థలు సగం జీతం ఇస్తూ, మరో జీవనోపాధి వెతుక్కునే అవకాశం కల్పిస్తూ కొన్ని సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏది ఏమైనా కొన్ని షరతులకు లోబడి ఇలాంటి వారిని గుర్తించి, కొంత సాయం చేసేందుకు కేంద్రం సంకల్పించింది. అయితే దీనికి కొన్ని నిబంధనలు విధిస్తూ అమలుకు చర్యలు తీసుకుంది.

కోవిడ్‌–19 ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారా..? ఇలాంటి వారికి కొత్తగా మరో ఉద్యోగం దొరికేవరకు తాత్కా లిక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటల్‌ బీమిత్‌ వ్యక్తి కళ్యాణ్‌ యోజన (ఏబీవీకేవై) పథకం కింద 3 నెలల పాటు సగం జీతం ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ పథకం కనీసం రెండేళ్ల సీనియర్‌ ఈఎస్‌ఐ చందాదారులైన వారికి మాత్రమే వర్తిస్తుంది. కోవిడ్‌–19 వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ విధించింది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ లాక్‌డౌన్‌... ఆ తర్వాత దశలవారీగా అన్‌లాక్‌ నిబంధనలతో పలు వ్యాపారాలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు ఏకంగా 50శాతం ఉద్యోగాలను కోతపెట్టాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పలువురు నిరుద్యోగులుగా మారారు. వారికి కుటుంబపోషణ భారమైంది. ఈ పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక శాఖ ఇలాంటి వారికి నిరుద్యోగ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.

నెల తర్వాత దరఖాస్తు...

ఏదేని కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోవిడ్‌–19 కారణంగా జాబ్‌ కోల్పోతే నెలరోజుల తర్వాత ఈ పథకానికి అర్హత సాధిస్తాడు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా, ఈఎస్‌ఐసీ వివరాలతో ఆన్‌లైన్‌లో ఈఎస్‌ఐసీ పోర్టల్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మాన్యువల్‌ పద్ధతిలో ఈఎస్‌ఐసీ కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులో యాజమాన్యం నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దరఖాస్తు పరిశీలించిన అనంతరం లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు. నిర్దేశించిన గరిష్ట గడువులోగా ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది.

సాయంగా సగం జీతం...

ఏబీవీకేవై పథక కింద లబ్ధిదారులకు నెలలో సగం జీతాన్ని సాయంగా ఇస్తారు. ఈ పథ కం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి వరుసగా రెండేళ్ల పాటు ఈఎస్‌ఐ చందా చెల్లిస్తూ ఉం డాలి. ఆ వ్యక్తి రెండేళ్ల వేతనాన్ని రోజువారీ వేతన రూపంలో లెక్కించిన తర్వాత... నెల లో పదిహేను రోజుల భత్యాన్ని లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈఎస్‌ఐసీ నిబంధనల్లో ఈ వెసులుబాటు ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో ఒకేసారి వినియోగించుకునే వీలుంది. సగం జీతం ఇచ్చే నిబంధన ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలంలో వచ్చిన దరఖాస్తులకు మా త్రమే వర్తిస్తుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చే దర ఖాస్తులకు 25 శాతం వేతనాన్ని ఇస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories