DA Hike: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..డీఏ పెంపు

DA Hike: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..డీఏ పెంపు
x
Highlights

DA Hike : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక కోటి మంది ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి సందర్భంగా డిఏ పెంపుతో గుడ్ న్యూస్ వినిపించింది. ఈ పెంపు వల్ల ఖజానాకు 9000 కోట్లకు పైగా అదనపు భారం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం 50 శాతం ఉన్న డిఏ 53 శాతానికి చేరింది.

అయితే ఈ డి ఏ ప్రస్తుతం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణో తెలిపారు. పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు అలాగే పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డిఎ పెంచింది. అంతేకాదు మూడు నెలల బకాయిలు కూడా భాగం కానున్నాయి.

ఇదిలా ఉంటే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచేందుకు సిద్ధం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, , హర్యానాలో ఒక సైతం నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఎనిమిదవ పే కమిషన్ 2025 నాటికి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ కమిషన్ ఏర్పాటు చేసి ప్రస్తుత జీతభత్యాలను సవరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగులకు చెప్తున్నారు. గతంలో ఏడవ పే కమిషన్ 2014 సంవత్సరంలో ఏర్పాటు చేశారు 2015వ సంవత్సరం నుంచి ఏడవ పే కమిషన్ అమలులోకి వచ్చింది.

10 సంవత్సరాల తర్వాత మరోసారి 8వ పే కమిషన్ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఏర్పడింది. ఎనిమిదవ పే కమిషన్ ఏర్పడితే వేతనాలు పెన్షన్లు మరోసారి పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం చివరి నాటికి ఎనిమిదవ పే కమిషన్ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఉద్యోగులను ఉద్దేశించి అటు ఈపీఎఫ్ఓ ఈపీఎస్ 95 పెన్షనర్లకు సైతం హయ్యర్ పెన్షన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పెన్షనర్ల అభ్యర్థన పై సానుకూలత వ్యక్తం చేశారు. హయ్యర్ పెన్షన్ల ఆప్షన్లను స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను సైతం స్వీకరిస్తున్నారు. త్వరలోనే ఇది కూడా అమలులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories