డిజిటల్ పేమెంట్లపై అడిషనల్ ఛార్జీల వసూళ్లపై కేంద్రం క్లారిటీ

Centeral Govt Clarity On Collection Of Additional Charges On Digital Payments
x

డిజిటల్ పేమెంట్లపై అడిషనల్ ఛార్జీల వసూళ్లపై కేంద్రం క్లారిటీ

Highlights

UPI Payments: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్స్ ద్వారా చెల్లింపులపై ఛార్జీలుండవు

UPI Payments: కరోనా పరిస్థితుల తర్వాత డిజిటల్ పేమెంట్లు అనూహ్యంగా పెరిగాయి. పెద్దపెద్ద సూపర్ మార్కెట్లనుంచి... కూరగాయల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు సైతం డిజిటల్ పేమెంట్లను స్వీకరించడం మొదలు పెట్టారు. దీంతో డిజిటల్ పేమెంట్లకు ఊపొచ్చింది. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేకంగా యాప్‌లు పుట్టుకొచ్చాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్స్ ద్వారా చెల్లింపులు ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి ఆయా పేమెంట్స్‌పై ఛార్జీలు విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్స్ వాడుతున్న వారిలో ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా ఆయా వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పే , ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు చేసే పేమెంట్స్ పూర్తిగా ఉచితమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

'ఉచితంగా, ఫాస్ట్‌గా, సెక్యూర్‌గా, వేగంగా జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఇటీవలి కాలంలో యూపీఐ అత్యంత ఆధారణ పొందుతోంది. యూపీఐ యాప్ ద్వారా బ్యాంక్‌కు లింక్ చేసి పేమెంట్స్ చేస్తున్న లావాదేవీలో 99.9 శాతం ఉన్నాయి. ఇలా బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బులు పంపిస్తున్న లావాదేవీలు ఇప్పటికీ కస్టమర్లకు, మర్చంట్లకు పూర్తిగా ఉచితం.' అని తెలిపింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇటీవలి రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్ (PPI వాలెట్స్)ను ఇంటర్ ఆపరేబుల్ యూపీఐ ఎకోసిస్టమ్స్‌కి అవకాశం ఇచ్చామని తెలిపింది.

ఈ క్రమంలో పీపీఐ మర్చంట్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయిని స్పష్టం చేసింది ఎన్‌పీసీఐ. అయితే, కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవని వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ మధ్య జరిగే యూపీఐ పేమెంట్స్‌కు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని, పూర్తిగా ఉచితమని మరోసారి స్పష్టం చేసింది ఎన్‌పీసీఐ. యూపీఐ యాప్స్ వాడాలనుకుంటున్న వారు ఏ బ్యాంక్ ఖాతానైనా లేదా రుపే క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ వాలెట్స్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది ఎన్‌పీసీఐ.

ఎన్‌పీసీఐ ఇటీవల విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్స్ పీపీఐ మర్చంట్ ట్రాన్సాక్షన్లపై 0.5 శాతం నుంచి 1.1 శాతం ఛార్జీలు విధించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, అది కేవలం పీపీఐ మర్చంట్ పేమెంట్లకు మాత్రమేనని, బ్యాంక్ నుంచి బ్యాంకు మధ్య జరిగే ట్రాన్సాక్షన్లు పూర్తిగా ఉచితమని ఎన్‌పీసీఐ ప్రకటన చేసింది. పీపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు రూ.2000 మించితే ఆయా లావాదేవీలపై 1.1 శాతం వరకు ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories