MP Quota Canceled: కేంద్రం సంచలన నిర్ణయం.. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు..

Center Sensational Decision MP Quota Canceled in Kendriya Vidyalayas
x

MP Quota Canceled: కేంద్రం సంచలన నిర్ణయం.. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు.. 

Highlights

MP Quota Canceled: కేంద్రం సంచలన నిర్ణయం.. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు..

MP Quota Canceled: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాని రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రతి ఏడాదిలో ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయించేది. తాజా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) సర్క్యూలర్ జారీ చేసింది.

పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా పార్లమెంట్ సభ్యల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఎంపీ కోటా సీట్లు మొత్తాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పలువురు విద్యావంతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల టాలెంట్ ఉన్న విద్యార్థులకి నష్టం జరుగుతుందని వెల్లడించారు.

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై లోక్‌సభలోనూ చర్చ జరిగింది. అయితే ఎంపీల కోటాను ఎత్తి వేయాలని కొందరు.. ఆ సీట్లను మరిన్ని పెంచాలని మరికొందరు డిమాండ్ చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా కేంద్రీయ విద్యాలయాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మార్చి 21 నుంచి జూన్ 30 వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories