Employment Rate - India: సెప్టెంబర్‌ 2021లో 85 లక్షలు పెరిగిన ఉద్యోగాలు

Center For Monitoring Indian Economy Calculations Says Recovery of Economy of India Taking Place | National News
x

Employment Rate - India: సెప్టెంబర్‌ 2021లో 85 లక్షలు పెరిగిన ఉద్యోగాలు

Highlights

Employment Rate - India: *6.9 శాతానికి పరిమితిమైన నిరుద్యోగ రేటు *ఈ ఏడాది ఆగస్టులో 8.3 శాతం

Employment Rate - India: కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ బాట పడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 2021లో మొత్తం ఉద్యోగాలు 85 లక్షలు పెరగడంతో నిరుద్యోగ రేటు 6.9 శాతానికి పరిమితమైంది. కరోనా ప్రారంభంలో మార్చి 2020న ఇది 20 శాతంగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో 8.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు సెప్టెంబరులో మరింత తగ్గింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ విడుదల చేసిన నెలవారీ గణాంకాల ప్రకారం.. కరోనాకు ముందునాటి ఫిబ్రవరి 2020 తర్వాత అత్యుత్తమ ఉద్యోగ గణాంకాలు ఇవే.

సెప్టెంబరులో వేతన ఉద్యోగాలు ఆగస్టుతో పోలిస్తే 70 లక్షలు పెరిగి, మొత్తం ఉద్యోగాలు 7.71 కోట్ల నుంచి 8.41 కోట్లకు చేరాయి. 2019-20 సగటు 8.67 కోట్ల వేతన ఉద్యోగాలు కావడం గమనార్హం. సెప్టెంబరులో రైతుల సంఖ్య 25.1 లక్షలు తగ్గి 11.36 కోట్లకు పరిమితమైంది. ఆగస్టులో వీరి సంఖ్య 11.6 కోట్లుగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారు వ్యవసాయేతర ఉపాధికి వెళ్లడం ఇందుకు నేపథ్యం.

చిన్న వ్యాపారాలు, రోజు కూలీ కార్యకలాపాలు ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో 12.85 కోట్ల నుంచి 13.40 కోట్లకు చేరాయి. గత నెలలో సంఘటిత, అసంఘటిత తయారీ రంగ ఉద్యోగాలు 29 లక్షల మేర పెరిగాయి. ఆహార పరిశ్రమ, లోహ రంగాల్లోనూ ఎక్కువ ఉద్యోగాలు జత అయ్యాయి. ఫార్మా, ఫుట్ వేర్, రత్నాభరాణాలు, చేతివృత్తులలోనూ ఉద్యోగాలు ఎక్కువయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories