Corona: యూపీలోని శ్మశానవాటికల్లో శవాల కుప్పలు

Cemetery Are Filled With Full Of Dead Bodys In UP
x

ఉత్తరప్రదేశ్ లోని స్మశానవాటిక (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: లోపల పదుల సంఖ్యలో దహనం * దహనానికి 5-6 గంటల సమయం

Corona: స్మశానవాటికలో ఒకేసారి 25-30 మృతదేహాలు ఉండడం గతంలో ఎప్పుడూ చూడలేదు. వాటికకు పక్కన ప్లాట్‌ఫాం ఎప్పుడూ ఖాళీగా ఉండేది. ఇప్పుడక్కడ కాలు పెట్టేందుకూ వీల్లేకుండా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవులోని ముక్తిధామ్‌ శ్మశానవాటికల్లోని పరిస్థితి ఇది.

యూపీలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో లెక్కకు మంచి కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో దహనవాటికలన్నీ భగభగమంటున్నాయి. ఎప్పుడు చూసినా పదుల సంఖ్యలో మృతదేహాలు కాలుతున్నాయి. బయటా అదే సంఖ్యలో మృతదేహాల వరుస కనిపిస్తోంది. క్యూ లైన్లో నిల్చున్న కుటుంబసభ్యులు, బంధువులకు అవకాశం వచ్చి.. అంత్యక్రియలు ముగిసేదాకా 5-6 గంటల సమయం పడుతోంది.

వారణాసిలో ప్రధాన శ్మశానవాటిక మణికర్ణిక ఘాట్‌. సాధారణంగా ఇక్కడికే ఎక్కువగా మృతదేహాలను తెస్తుంటారు. అయితే ఆ నగరంలో మరోచోట ఉన్న హరిశ్చంద్ర ఘాట్‌ను కరోనా మృతదేహాల దహనం కోసం ఎంపిక చేశారు. దీంతో హరిశ్చంద్ర ఘాట్‌కు మృతదేహాల తాకిడి మునుపెన్నడూ లేనంతంగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. శ్మశానాలకు మృతదేహాల తాకిడి పెరగడంతో దహనానికి స్థలం చాలడం లేదు. గత నాలుగు రోజుల్లో 200 మృతదేహాలను దహనం చేశారు. చోటు సరిపోకపోవడంతో మరో రెండెకరాలను సిద్ధం చేసినట్లు భోపాల్‌ భద్బాడా విశ్రామ్‌ ఘాట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సెక్రటరీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories