CCMB on Vaccine: మరో ఏడాది వరకు వ్యాక్సిన్ కష్టమే..

CCMB on Vaccine: మరో ఏడాది వరకు వ్యాక్సిన్ కష్టమే..
x
Highlights

తగ్గింది కేసులే.. కరోనా తీవ్రత కాదు ! ఏమీ కాదని అలసత్వంగా ఉన్నారో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది సీసీఎంబీ. మరో ఏడాది పాటు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు...

తగ్గింది కేసులే.. కరోనా తీవ్రత కాదు ! ఏమీ కాదని అలసత్వంగా ఉన్నారో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది సీసీఎంబీ. మరో ఏడాది పాటు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు అప్పటివరకు మనల్ని మనమే కాపాడుకోవాలని అంటున్నారు.

ప్రపంచం అలసిపోయింది వేరు దిక్కు లేక అలానే బందీగా ఉంటే బతికే మార్గం కనిపించక మళ్లీ కదులుతోంది ! కరోనా చేసిన మాయలు అన్నీ ఇన్నీ కావు. బతుకు చిత్రాన్ని ఒక్కసారిగా చిదిమేసింది. జీవితాలను తలకిందులు చేసిందీ మహమ్మారి ! కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేస్తోంది ప్రపంచం ఇప్పుడు ! వ్యాక్సిన్ ఎప్పుడా అని ఆశగా ఆర్తినిండిన కళ్లతో ఎదురుచూస్తోంది. ఐతే ఇలాంటి సమయంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా షాక్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

మరో ఏడాది వరకు వ్యాక్సిన్ కష్టమేనని రాకేశ్ మిశ్రా అంటున్నారు. వైరస్ బారి నుంచి బయటపడాలంటే వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండే ఆహారమే ఏకైక మార్గమని చెప్తున్నారు. తగ్గుతున్న కేసులను చూసి కరోనా తగ్గిపోయిందని అనుకుంటే పొరపాటేనని అంటున్నారు ! తగ్గుతున్నవి కేసులు మాత్రమే తీవ్రత కాదు అని క్లారిటీ ఇచ్చారు. అపోహలను పక్కనపెట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. భారత్ బయోటెక్, అరబిందో ఫార్మా సహా వివిధ కంపెనీలతో కలిసి వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు జ‌రుగుతున్నాయ‌ని టీకాపై వ‌చ్చే ఏడాది స్పష్టత వస్తుందన్నారు.

అన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావడం అంత తేలికైన పనికాదని ప‌రిశోధ‌న‌ల‌తో పాటు అదృష్టం కూడా కావాలని రాకేశ్ మిశ్రా అంటున్నారు. ఆయన ప్రకటనతో ఇప్పుడు జనాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. అటు కేంద్రం కూడా వచ్చే ఏడాది ప్రారంభంనాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అంటోంది. టీకా పంపిణీకి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని చెప్తోంది. ఇలాంటి సమయంలో సీసీఎంబీ చీఫ్ వ్యాఖ్యలు టెన్షన్ పుట్టిస్తున్నాయ్.

అన్‌‌లాక్ ప్రక్రియలో భాగంగా దాదాపు అన్ని రంగాలకు అనుమతి ఇచ్చింది కేంద్రం. దీంతో రోడ్లు, వీధుల్లో ఎప్పటిలానే కనిపిస్తోంది పరిస్థితి! ఐతే కరోనా తగ్గిందన్న అపోహ నుంచి బయటకు రావాలని మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని రాకేష్ మిశ్రా సూచిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సిన్ పరిస్థితి ఇలా ఉంటే అటు రష్యా ఇప్పటికే ఒక్క టీకా విడుదల చేసింది. ఇంకోదానికి ఓకే చెప్పింది. ఆక్స్‌ఫర్డ్ ట్రయల్ కూడా ఆల్‌మోస్ట్ అయిపోయాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories