డికె శివకుమార్ ఇంట్లో సీబీఐ దాడులు!

డికె శివకుమార్ ఇంట్లో సీబీఐ దాడులు!
x

 DK Shivakumar 

Highlights

CBI Raids In DK Shivakumar Home : కర్ణాటక రాష్ట్రంలో రాజరాజేశ్వర నగర్‌, సిరా అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

CBI Raids In DK Shivakumar Home : కర్ణాటక రాష్ట్రంలోని రాజరాజేశ్వర నగర్‌, సిరా అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపధ్యంలో సోమవారం ఉదయం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని దొడ్డనహళ్లి, కనకాపుర, సదాశివ నగర్‌తో పాటు మరో 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ తో పాటుగా అయన తమ్ముడు డీకే సురేష్‌ నివాసంలో కూడా సీబీఐ తన దాడులను నిర్వహిస్తోంది.

అయితే సీబీఐ దాడుల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధికార బీజేపీ పైన, కేంద్రం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలకి సిద్దం అవుతున్న తరుణంలో ప్రభుత్వం తమను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంది అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రధాని చేతిలో తోలుబోమ్ముగా మారిన సీబీఐ డీకే శివకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది అంటూ మండిపడ్డారు.

ముందుగా రాష్ట్రంలోని బీజేపీ సర్కారు అవినీతిని సీబీఐ బయటకుతీయాలని అయన మండిపడ్డారు. అటు సీబీఐ దాడులను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఖండించారు. ఇక నవంబర్ 3 న కర్ణాటకలో బైపోల్స్ జరగనున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే మనీలాండరింగ్ దర్యాప్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది 2019 సెప్టెంబర్ 3 న డీకే శివకుమార్‌ను ఢిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.




Show Full Article
Print Article
Next Story
More Stories