చిట్ ఫండ్ కుంభకోణం : మాజీ మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు

చిట్ ఫండ్ కుంభకోణం : మాజీ మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు
x
Highlights

చిట్ ఫండ్ కుంభకోణంలో ఇద్దరు ఐఎఎస్ అధికారులు, ఒక ఐపిఎస్ అధికారి పాత్రను నిర్ధారించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ జూలైలో కేసును తిరగదోడింది..

భువనేశ్వర్‌లో జరిగిన సీషోర్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మంత్రి, బిజెడి ఎమ్మెల్యే డెబి ప్రసాద్ మిశ్రా నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం దాడి చేసింది. ఏడుగురు సభ్యుల సిబిఐ బృందం శుక్రవారం మిశ్రా అధికారిక నివాసం తోపాటు మరో ఏడు ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. మూడు, నాలుగు గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చిట్ ఫండ్ కుంభకోణంలో ఇద్దరు ఐఎఎస్ అధికారులు, ఒక ఐపిఎస్ అధికారి పాత్రను నిర్ధారించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ జూలైలో కేసును తిరగదోడింది, ప్రధాన నిందితుల్లో ఒకరైన సుభాంకర్ నాయక్‌ను విచారించింది. కాగా సీషోర్ గ్రూప్.. సంవత్సరానికి 36 శాతం వడ్డీని ఆశజూపి వ్యక్తుల నుండి సుమారు 578 కోట్ల రూపాయలను సేకరించినట్లు తెలిసింది.

ఈ కేసులో అప్పటి ఒడిశా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఒటిడిసి) జనరల్ మేనేజర్ సంగ్రామ్ కేషరి రాయ్, పరాగ్ గుప్తాకు కూడా నోటీసులు ఇచ్చింది, పరాగ్ గుప్తా పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. డెబి మిశ్రా ఒడిశా కల్చర్ & టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో ఖోర్దాలో ప్రభుత్వం నడుపుతున్న గెస్ట్ హౌస్ కు సదరు కంపెనీకి అనుమతి ఇవ్వడమే కాకుండా కటక్‌లోని రెస్టారెంట్‌తో వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం సీషోర్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసులో అంతకుముందు మాజీ ఎంపి మయూర్ భంజ్, రామ్‌చంద్ర హన్స్‌దా, మాజీ చీఫ్ విప్ ప్రవత్ త్రిపాఠిని చిట్ ఫండ్ కుంభకోణంపై సిబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరికి బెయిల్ కూడా లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories