DHFL Bank fraud: డీహెచ్ ఎల్ బ్యాంక్ ఫ్రాడ్.. ధీరజ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

CBI Arrests Dheeraj Wadhawan In DHL Bank Fraud Case
x

DHFL Bank fraud: డీహెచ్ ఎల్ బ్యాంక్ ఫ్రాడ్.. ధీరజ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

Highlights

DHFL Bank fraud: ₹ 34,000 కోట్ల డిహెచ్‌ఎఫ్‌ఎల్ బ్యాంక్ మోసం దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం ధీరజ్ వాధ్వాన్‌ను అరెస్టు చేసింది

DHFL Bank fraud: ₹ 34,000 కోట్ల డిహెచ్‌ఎఫ్‌ఎల్ బ్యాంక్ మోసం దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం ధీరజ్ వాధ్వాన్‌ను అరెస్టు చేసింది. 2022లో ఈ కేసుకు సంబంధించి వాధ్వాన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది. యెస్ బ్యాంక్ అవినీతి కేసులో ధీరజ్ వాధ్వాన్‌ను గతంలో ఏజెన్సీ అరెస్టు చేసి బెయిల్‌పై ఉన్నాడు. 17 బ్యాంకుల కన్సార్టియంను ₹34,000 కోట్ల మేర మోసం చేసిందని ఆరోపించిన DHFL కేసును CBI నమోదు చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రుణ మోసంగా మారింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ₹22 లక్షల విలువైన బకాయిలను రికవరీ చేయడానికి, మాజీ DHFL ప్రమోటర్లు ధీరజ్, కపిల్ వాధ్వాన్‌ల బ్యాంక్ ఖాతాలతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌లను అటాచ్‌మెంట్ చేయాలని ఆదేశించింది. బహిర్గత నిబంధనలను ఉల్లంఘించిన కేసులో గత ఏడాది జూలైలో వాధ్వాన్‌ సోదరులుపై విధించిన జరిమానాను చెల్లించడంలో విఫలమవడంతో మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ చర్య తీసుకుంది.

జూలై 2023లో, బహిర్గత నిబంధనలను ఉల్లంఘించినందుకు, DHFL (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) ప్రమోటర్లుగా ఉన్న వాధ్వాన్‌లపై రెగ్యులేటరీ ఒక్కొక్కరికి ₹10 లక్షల జరిమానా విధించింది.

కపిల్ వాధ్వాన్ DHFL ఛైర్మన్, MDగా ఉండగా, ధీరజ్ వాధ్వాన్ కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వారిద్దరూ DHFL బోర్డులో ఉన్నారు. మరో పరిణామంలో, వైద్య కారణాలతో బెయిల్ కోరుతూ ధీరజ్ వాధ్వాన్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గత శనివారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

వైద్యపరమైన కారణాలతో బెయిల్‌ను నిరాకరించిన ట్రయల్‌ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ముంబైలోని తన ఇంట్లో చికిత్స పొందుతున్నారు. జస్టిస్ జ్యోతి సింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసు జారీ చేసి, సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసు విచారణ కోసం శుక్రవారం (మే 17)న జాబితా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories