పాముల పంతం.. చేపకు పునర్జన్మ..

పాముల పంతం.. చేపకు పునర్జన్మ..
x
Highlights

ఆకలితో ఉన్న రెండు పాములు భోజనంకోసం వెతుకుతుండగా.. ఒక క్యాట్ ఫిష్ దొరికింది. దాంతో పండగ చేసుకుందామని అనుకున్నాయి. ..

ఆకలితో ఉన్న రెండు పాములు భోజనంకోసం వెతుకుతుండగా.. ఒక క్యాట్ ఫిష్ దొరికింది. దాంతో పండగ చేసుకుందామని అనుకున్నాయి. అయితే వాటి పంతం వలన ఆ చేప తన ప్రాణాలను నిలబెట్టుకుంది. దీంతో ఆ చేప ఎవరికీ ఆహరం కాకుండా నీటిలోకి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కన్హా నేషనల్ పార్క్ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ నీటి కుంటలో చేపలు ఉన్నాయి, అయితే ఆకలి మీద ఉన్న రెండు పాముల్లో ఒక పాము ముందుగా నీటిలో ఉన్న ఓ చేప తలను పట్టుకుంది. ఈ క్రమంలో రెండో పాము కూడా కిందనుంచి వచ్చి చేప తోక పట్టుకుంది. దీంతో రెండు కూడా చేప నాకంటే నాకనే విందంగా విడవకుండా ఉన్నాయి.

దాదాపు 30 నిమిషాల పాటు రెండు పాములు పట్టుదలగా అలాగే ఉండిపోయాయి.. ఈ దృశ్యాన్ని పర్యావరణ ప్రేమికుడు ఘన్‌శ్యామ్‌ ప్రసాద్‌ భన్‌వారే వీడియో తీశాడు. అయితే దాదాపు 30 నిమిషాల తర్వాత విసుగు చెందిన ఓ పాము చేప తోకను వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత పైనున్న పాముకూడా నువ్వు వేసే బిక్ష నాకెందుకు అన్నట్టుగా ఆ చేపను పైకి లాగకుండా అలాగే నీళ్లలోకి వదిలేసింది. దీంతో ఆ చేప ఇదే సమయం అనుకోని వెంటనే బతుకుజీవుడా అంటూ నీటిలోకి జారుకుంది. దేంతో ఆ చేప ఎవరికీ దొర్లకుండా పోయింది. దీనికి కారణం వాటి పంతం.. పాముల పంతం వలన ఆ చేపకు పునర్జన్మ లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories