SBI Credit card Offers: SBI క్రెడిట్ కార్డుతో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

SBI Credit card Offers: SBI క్రెడిట్ కార్డుతో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
x
Highlights

నూతన సంవత్సరం సందర్భంగా దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతుంది.

నూతన సంవత్సరం సందర్భంగా దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతుంది. అన్ని వర్గాల కస్టమర్లను సంతృప్తి పరుస్తూ సేవలను అందింస్తుంది. బ్యాంకింగ్ సర్వీసులను మాత్రమే కాకుండా కస్టమర్లకోసం వారి అనుబంధ సంస్థల ద్వారా క్రెడిట్ కార్డు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర సేవలు కూడా అందిస్తుంది ఎస్ బీఐ.

మంచి ఆఫర్లతో బ్యాంకు అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డులను కస్టమర్లు తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ఇక అలాంటి కస్టమర్లకోసం స్టేట్ బ్యాంక్ మాత్రమే కాకుండా దానితో పాటు ఐఆర్‌సీటీసీతో (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కలిసి సరికొత్త ఎస్‌బీఐ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డును అందించడానికి జతకట్టింది. ఈ కార్డు ద్వారా ఖాతాదారులకు ఎన్నో ఆఫర్లను అందిస్తుంది.

కార్డు ద్వారా అందించే ఆఫర్లు..

కార్డు తీసుకున్న మొదటి ఏడాది వార్షిక ఫీజు చెల్లిస్తే వారికి రూ.1,500 లేదా 1,500 బోనస్ పాయింట్లను అందిస్తుంది.

♦ కార్డు తీసుకున్న తొలి 60 రోజుల్లో రూ.2,000 ఖర్చు చేస్తే రూ.500 విలువైన బుక్‌మైషో వోచర్ అందిస్తుందన్నారు.

కార్డు ప్రయోజనాలు..

♦ ఈ కార్డు ద్వారా రైళ‌్లలో ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు.

♦ విమాన టికెట్ బుకింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుందని తెలిపారు.

♦ ఈ కార్డు ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లో రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే 1.8 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

♦ యాన్వల్ ట్రావెల్ స్పెండ్స్ రూ.50,000 దాటితే రూ.2,500 బోనస్ రివార్డ్ పాయింట్లు అందిస్తామని తెలిపారు.

♦ లక్ష రూపాయలు దాటితే రూ.5,000 బోనస్ పాయింట్లు అందిస్తామని తెలిపారు.

♦ కాంప్లిమెంటరీ రైల్వే ఇన్సూరెన్స్‌ను రూ.10 లక్షల వరకు ఉచితంగా పొందొచ్చని తెలిపారు.

♦ కార్డు జాయినింగ్ ఫీజు కేవలం రూ.1,499 మాత్రమే చెల్లించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories