Lok Sabha: లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ ఘటన కేసు.. విజిటర్ పాస్‌లు రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన

Case File On Tear Gas Incident In Lok Sabha
x

Lok Sabha: లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ ఘటన కేసు.. విజిటర్ పాస్‌లు రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన

Highlights

Lok Sabha: భద్రతా వైఫల్యాలపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్

Lok Sabha: లోక్‌సభ ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లోక్‌సభలో ఫోరెన్సిక్ టీమ్ విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. విజిటర్ పాస్‌లు రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరో వైపు పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ ఘటన కేసులో మొత్తం ఆరుగురు నిందితులున్నట్టు గుర్తింపు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. టియర్‌ గ్యాస్‌ ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు పోలీసుల విచారణలో నిందితురాలు నీలం వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories