ట్రంప్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

ట్రంప్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
x

file image

Highlights

అమెరికా చరిత్రలో తొలిసారి మాజీ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం విచారణకు వచ్చింది. సెనేట్‌లో తీర్మానంపై దర్యాప్తు ప్రారంభం అవగా.. డెమొక్రాట్లు కీలక...

అమెరికా చరిత్రలో తొలిసారి మాజీ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం విచారణకు వచ్చింది. సెనేట్‌లో తీర్మానంపై దర్యాప్తు ప్రారంభం అవగా.. డెమొక్రాట్లు కీలక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేశారు. దీంతో ట్రంప్‌ ఉచ్చులో పడడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానంపై సెనేట్‌లో బుధవారం విచారణ ప్రారంభమైంది. తీర్మానంపై విచారణకు సెనేట్‌లో ఆరుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు పలికారు. సభలో క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి పురిగొల్పారంటూ ఆయన్ను అభిశంసించే దిశగా డెమొక్రాట్లు వాదనలు వినిపిస్తున్నారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కీలక వీడియోను విడుదల చేశారు.

మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా పలువురు అమెరికా చట్టసభ్యుల పైకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడం, పోలీసులపై దాడికి దిగడం వంటి దారుణాలు ఫుటేజ్‌లో కనిపించాయి. మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌, నాన్సీ పెలోసీల కోసం వెతకడం వీడియోలో కనిపించింది. ఆందోళనకారుల విధ్వంసంతో పెన్స్‌ సహా ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు పోలీసులు వారిని తీసుకెళ్లడం, పోలీసులపై ఆందోళనకారులు దాడి చేసిన విషయాలు స్పష్టమవుతున్నాయి. పెన్స్‌ను ఉరి తీయండి అంటూ వారు చేసిన నినాదాలు కూడా వినిపించాయి. దీంతో ట్రంప్‌పై కేసులో ఈ వీడియో బలమైన ఆధారంగా నిలిచే అవకాశముంది. దీంతో పాటు ఓ ఆడియోను కూడా రిలీజ్ చేయడంతో ట్రంప్‌పై చర్యలు తప్పేలా కనిపించడం లేదు.

ఇక తీర్మానంపై చర్చలో పలువురు డెమొక్రాటిక్‌ నేతలు మాజీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. ట్రంప్ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా నిర్వర్తించాల్సిన విధులను విస్మరించారని.. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని పరిరక్షిస్తానంటూ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని కాంగ్రెస్‌ ధ్రువీకరించకుండా అడ్డుకునేలా మద్దతుదారులను రెచ్చగొట్టారని ఆరోపించారు. పెన్స్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉన్న వంద అడుగుల దూరం వరకు ఆందోళనకారులు వెళ్లారని.. ఆ రోజు సెనేట్‌ స్పీకర్‌ చిక్కి ఉంటే, చంపేసి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

డెమొక్రాట్ల వాదనల తర్వాత ట్రంప్‌ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ట్రంప్‌పై ప్రవేశపెట్టిన తీర్మానానికి 67 మంది సభ్యులు ఆమోదం తెలిపితేనే ట్రంప్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సభలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లకు చెరో 50 మంది బలం ఉంది. అయితే ఆరుగురు రిపబ్లికన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడినా డెమొక్రాట్ల బలం 56కు చేరనుంది. దీంతో సెనేట్‌లో అభిశంసన తీర్మానం నిలబడుతుందా..? వీగుతుందాtrump? అనే సందిగ్ధత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories