Corona Vaccine During Periods: పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవాలా..వద్దా? ఏది నిజం..!
Corona Vaccine During Periods: దేశంలో ఓవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.
Corona Vaccine During Periods: దేశంలో ఓవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసి, అందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
అయితే వ్యాక్సిన్ పై కొంతమంది లేనిపోని భయాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఈ మధ్య వాట్సప్ లో నూ ఓ వార్త సంచలనం గా మారింది. మహిళలు పీరియడ్స్ (నెలసరి) కి ముందు, ఆ తరువాత ఐదు రోజుల పాటు కరోనా వ్యాక్సిన్ వేసుకోవద్దనని వార్త సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తుంది. అయితే మరి ఇందులో ఎంత నిజం ఉంది? అసలు నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
మహిళల పీరియడ్ టైంలో వ్యాక్సిన్ వేసుకోవద్దు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఫేక్ అంటూ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా తేల్చేశారు. ఈ మేరకు ప్రముఖ గైనకాలజిస్ట్, పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత మంజుల అనగాని తో కన్మ్‌ఫాం చేసుకుని వెల్లడిస్తున్నానని వివరించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ సోషల్ మీడియాలో కోరారు. అటు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ వార్తలను ఫేక్ అని తేల్చి పారేసింది. ఈ పుకార్లను నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేసింది.
Here's the video with Dr. Manjula Anagani from my IGTV
— Chinmayi Sripaada (@Chinmayi) April 24, 2021
Please watch and share to anyone who is concerned about the Covid Vaccine. https://t.co/U1yLxRjcp3
అలాగే.. కరోనా వ్యాక్సిన్ నెలసరి క్యాలెండర్ లో మార్పులకు కారణమవుతుందనేందుకు ఆధారాలు లేవు. ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికే టీకా తీసుకున్న మహిళలు తమకెలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నాక ఒకసారి పీరియడ్ సమయంలో తేడాలు వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
Please STOP sharing that the Covid Vaccine affects your period / cannot be taken during your period.
— Chinmayi Sripaada (@Chinmayi) April 23, 2021
NOT TRUE!!#Verified with a Padmasri Award Winning Gynaecologist Dr Manjula Anagani
టీకాతో ఏర్పడే సమస్యల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పోస్ట్ స్కాలర్ రచయిత కాథరిన్ లీ చికాగో చెప్పారు. రుతుస్రావం అనేది ఒత్తిడికి సంబంధించినదై ఉంటుందని శాన్ డియాగోలోని ప్రముఖ స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్ కెల్లీ కల్వెల్ చెప్పారు. వ్యాక్సిన్ తరువాత యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యేందుకు కొంత ఒత్తిడి ఏర్పడుతుందని, బహుశా ఇదే సమస్యకు కారణం కావచ్చన్నారు.
#Fake post circulating on social media claims that women should not take #COVID19Vaccine 5 days before and after their menstrual cycle.
— PIB Fact Check (@PIBFactCheck) April 24, 2021
Don't fall for rumours!
All people above 18 should get vaccinated after May 1. Registration starts on April 28 on https://t.co/61Oox5pH7x pic.twitter.com/JMxoxnEFsy
వ్యాక్సిన్ తరువాత శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన, ఎండోమెట్రియంను, రుతుస్రావం సమయంలో మందంగా ఉండే గర్భాశయం లైనింగ్‌పై ప్రభావంతో ఈ సమస్యలు ఏర్పడి ఉంటాయా అనే సందేహాన్నిఆమె వ్యక్తం చేశారు. ఈ సమస్యలు ఇతర వ్యాక్సిన్లలో కూడా ఉండవచ్చని పేర్కొన్నారు.
24ఏళ్ళ మహిళ మాత్రం టీకా తీసుకున్న తర్వాత 5 రోజుల ముందుగానే తనకు పీరియడ్ వచ్చిందని.. బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. ఎనిమిది సంవత్సరాల క్రితమే మెనోపాజ్ వచ్చిన తనకు వ్యాక్సిన్ తీసుకున్న మూడు వారాల తర్వాత మళ్లీ బ్లీడింగ్ అవుతుందని మరో మహిళ వెల్లడించిందని వారు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని, కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అనేది మనలో రోగనిరోధక శక్తిని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire