Women Reservation Bill: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

Cabinet Approves Women Reservation Bill Granting 33pc Seats To Women In Parliament
x

Women Reservation Bill: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

Highlights

Women Reservation Bill: నారీశక్తి వందన్ అధినియం 2023 పేరుతో మహిళా బిల్లు

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టగా.. దానిపై సుధీర్ఘమైన చర్చ జరిగింది. అధికార, విప క్ష సభ్యులు తమ అభ్యంతరాలను, సూచనలను తెలియజేశారు. ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం చేశారు. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో మెజారిటీ సభ్యులు.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో చారిత్రక బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపినట్టు అయింది. ఇప్పటికే బిల్లు లోక్ సభలో పాస్ కాగా.. ఇప్పుడు రాజసభ్య ఆమోద ముద్ర వేయడంతో.. ఉభయ సభల ఆమోదం తెలిపినట్టైంది. ఇక బిల్లుకు రాష్ట్రపతి రాజముద్ర వేస్తే.. చట్టరూపం దాల్చుతుంది. ఈ బిల్లుతో లోక్ స‎భ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు..33శాతం కోటా కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories