Bengal By-Election Counting: పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

By-Election Counting of 3 Assembly Seats in West Bengal Today 03 10 2021 | National News Today
x

West Bengal Election Counting: పశ్చిమ బెంగాల్‌లో 3 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

Highlights

Bengal By-Election Counting: *భవానీపూర్‌, జంగీపుర్‌, సంషేర్‌గంజ్‌ ఉపఎన్నికల కౌంటింగ్‌ *మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

West Bengal By-Election Counting: పశ్చిమ బెంగాల్‌లో 3 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. భవానీపూర్‌, జంగీపుర్‌, సంషేర్‌గంజ్‌ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక భవానీపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేశారు. సెప్టెంబర్‌ 30న జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధికంగా సంషేర్‌గంజ్‌లో 79.92 శాతం, జంగీపూర్‌లో 77.63 శాతం, భవానీపూర్‌లో 57 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఇక ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. భవానీపూర్‌లో మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మరోపక్క అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భవానీపూర్‌ నియోజకవర్గం టీఎంసీకి కంచుకోట. అయితే గత సాధారణ ఎన్నికల్లో దీదీ ఈ స్థానాన్ని వదిలేసి, నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించినా నందిగ్రామ్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి చేతిలో దీదీ ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్‌లో గెలిస్తేనే ఆమె సీఎం పదవిలో కొనసాగుతారు. దీంతో భవానీపూర్‌ బైపోల్‌ రిజల్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories