Hikes Bus Fare: కర్నాటకలో 15శాతం పెరిగిన బస్సు టికెట్ ఛార్జీలు..ఫ్రీ బస్ ఎఫెక్టేనా?

Hikes Bus Fare: కర్నాటకలో 15శాతం పెరిగిన బస్సు టికెట్ ఛార్జీలు..ఫ్రీ బస్ ఎఫెక్టేనా?
x
Highlights

Hikes Bus Fare: కర్నాటక ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. బస్సు టికెట్ ఛార్జీలను 15శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్ ఛార్జీల...

Hikes Bus Fare: కర్నాటక ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. బస్సు టికెట్ ఛార్జీలను 15శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్ కే పాటిల్ తెలిపారు.

కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నార్త్ వెస్ట్ కర్నాటక రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, కల్యాణ కర్నాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, రవాణా కార్పొరేషన్లో బస్సు ఛార్జీలు 15శాతానికి పెంచారు. ఈ నాలుగు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్లలో 10ఏళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం రూ. 9.16కోట్లు ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 13.21 కోట్లకు పెంచారు. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు రూ. 12. 95 కోట్ల నుంచి రూ. 18.36 కోట్లు ఉంది. అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హెచ్ కే పాటిల్ తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

ఇక కర్నాటకలో అమలు అవుతున్న ఫ్రీ బస్సు స్కీం శక్తి నాన్ లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని పాటిల్ తెలిపారు. రూ. 2000కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేయమని తెలిపారు. అయితే 13శాతం , 15శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని కానీ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ ధరలను పరిశీలించి 15శాతం పెంచాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ ఒకటి. దాదాపు ఏడాదిన్నర పైగ కర్నాటకలో ప్రీ బస్సు జర్నీ అమలు అవుతోంది. వీరి స్పూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ స్కీమును తీసుకువచ్చింది. ఏపీలోనూ ఈ ఉచిత బస్సు స్కీమును అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories