ట్రాఫిక్ లో మన వెనుక ఎవరన్నా ఊరికే ఆగకుండా హారన్ కొడితే ఎక్కడో కాలుతుంది. అయితే, ఏమీ చేయలేక మనం గమ్మున ఉంటాం లోపల్లోపల తిట్టుకుంటూ..
ట్రాఫిక్ లో మన వెనుక ఎవరన్నా ఊరికే ఆగకుండా హారన్ కొడితే ఎక్కడో కాలుతుంది. అయితే, ఏమీ చేయలేక మనం గమ్మున ఉంటాం లోపల్లోపల తిట్టుకుంటూ. కానీ అది ఎద్దు.. అసలే అప్పటికే దానికి ఏమైందో మరి.. రోడ్డుమీద వెళుతుంటే ఓ కారు డ్రైవర్ దాన్ని తప్పుకోమని హారన్ కొట్టాడు. ఇంకేముంది దానికి మరింత మంట ఎక్కినట్టుంది. ఇక ఒక్కసారిగా వెనక్కితిరిగి కారును కుమ్మడం మొదలు పెట్టింది. కుమ్మడం అంటే అలా ఇలా కాదు.. కొమ్ములతో దాదాపు ఆ కారు తిరగబడిపోయే స్థితికి వెళ్లేట్టుగా కుమ్మేసింది. ఈ లోపు అక్కడి జనాలు చూసి పరిగెత్తుకొచ్చి ఆ ఎద్దును శాంతింపచేశారు.
బీహార్‌లోని హాజీపూర్ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న కారు హారను మోతకి ఆ ఎద్దు అలా ప్రవర్తించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. అమిత్ అలోక్ అనే ఆయన ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే.. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.
ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. మీరూ ఆ వీడియో చూసేయండి మరి!
बिहार के हाजीपुर में सड़क पर सांड दिखे तो हॉर्न नहीं बजाएं। अन्यथा देखिए अंजाम...
— AMIT ALOK (@amitalokbihar) November 4, 2019
हाजीपुर रेलवे स्टेशन के पास सड़क पर सांड को देख एक कार चालक ने हॉर्न क्या बजाया, गुस्साए सांड ने कार को सींग से उठाकर खूब पटका। खास बात यह कि वहां यह पहली घटना नहीं है।
...कहां है नगर प्रशासन? pic.twitter.com/hJqN6HpoLg
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire