పాక్‌ ఎత్తులను చిత్తు చేసిన బీఎస్‌ఎఫ్‌

BSF Shoots Drone Carrying Heroin From Pakistan
x

పాక్‌ ఎత్తులను చిత్తు చేసిన బీఎస్‌ఎఫ్‌

Highlights

Border Security Force (BSF): పాకిస్థాన్‌ దుశ్చర్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓ వైపు భారత్‌లోకి ఉగ్రవాదులను పంపుతూ మరోవైపు భారీగా డ్రగ్స్‌ను సప్లయ్‌ చేస్తోంది.

Border Security Force (BSF): పాకిస్థాన్‌ దుశ్చర్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓ వైపు భారత్‌లోకి ఉగ్రవాదులను పంపుతూ మరోవైపు భారీగా డ్రగ్స్‌ను సప్లయ్‌ చేస్తోంది. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సెక్టార్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దులో పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ డ్రోన్‌ను బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌-బీఎస్ఎఫ్‌ కూల్చేసింది. పాక్‌ డ్రోన్‌ ద్వారా స్మగ్లింగ్‌ ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్‌ అడ్డుకున్నది. ఈ డ్రోన్‌లో 10 కిలోలా 67 గ్రాముల తొమ్మిది హెరాయిన్‌ పాకెట్లు లభించాయి.

అర్ధరాత్రి 300 కిలోమీటర్ల ఎత్తులో అనుమాస్పద వస్తువు ఎగురుతున్న శబ్దాన్ని బీఎస్‌ఎఫ్‌ దళాలు గుర్తించి తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపినట్టు బీఎస్‌ఎఫ్‌ డీఐజీ భూపేందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ డ్రోన్‌, అందులోని పాకెట్లపై పాకిస్థాన్ మూలాలు స్పష్టంగా తెలుస్తున్నాయని డీఐజీ భూపేందర్‌ చెప్పారు. పాకిస్థాన్‌ హైటెక్‌ స్మగ్లింగ్‌ ఎత్తులను బీఎస్‌ఎఫ్‌ చిత్తు చేస్తోంది. ఈ నెలలో నాలుగు సార్లు డ్రోన్లను గుర్తించినట్టు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

నిషేదిత డ్రగ్స్‌ను పాకిస్థాన్‌ గుట్టుగా సరఫరా చేసేందుకు యత్నిస్తోందని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ భూపేందర్‌ చెప్పారు. ఇటీవల పాకిస్థాన్ నుంచి డ్రోన్లు వస్తున్నప్పటికీ వాటిలో డ్రగ్స్‌ ఎప్పుడూ పంపలేదు. డ్రోన్‌లో డ్రగ్స్‌ పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సరిహద్దులో మనుషుల ద్వారా ఇప్పటివరకు పాకిస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరాకు యత్నించేవారు. ఇప్పుడు ఆధునిక పద్ధతులను పాక్‌ వినియోగించుకుంటూ డ్రోన్స్‌ ద్వారా డ్రగ్స్‌ తరలించేందుకు యత్నిస్తోంది. ఈ విషయమై పాకిస్థాన్‌ నుంచి వచ్చిన డ్రోన్‌పై బీఎస్‌ఎఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రోన్‌ పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్టు పాక్‌ మిలటరీ అధికారులకు తెలిపినట్టు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. డ్రోన్‌ లభించిన ప్రాంతంలో పోలీసులతో కలిసి.. దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు బీఎస్‌ఎఫ్‌ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories