భారత్‌లో చొరబాట్లకు పాక్‌ కొత్త ఎత్తుగడలు

భారత్‌లో చొరబాట్లకు పాక్‌ కొత్త ఎత్తుగడలు
x
Highlights

భారత్‌లో చొరబాట్లకు పాక్‌ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సరిహద్దుల వెంట సొరంగాలను ఏర్పాటు చేసింది. జమ్మూలోని సాంబా సెక్టార్‌లో పాక్‌కి...

భారత్‌లో చొరబాట్లకు పాక్‌ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సరిహద్దుల వెంట సొరంగాలను ఏర్పాటు చేసింది. జమ్మూలోని సాంబా సెక్టార్‌లో పాక్‌కి సంబంధించిన ఓ సొరంగాన్ని గుర్తించారు బీఎస్ఎఫ్‌ జవాన్లు. ఉగ్రవాదుల చొరబాట్లు, ఆ‍యుధాల రవాణా, డ్రగ్స్ సరఫరాకి ఈ సొరంగం నిర్మించారని భావిస్తున్నారు అధికారులు.

జమ్మూలోని భారత్‌ పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. ఆ సొరంగ మార్గంలో ఇసుక సంచులను భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిపై పాకిస్థాన్‌కు చెందిన గుర్తులు కనిపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ తరహా సొరంగ మార్గాలు ఇంకా ఉన్నాయోమో కనుగొనేందుకు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఆపరేషన్‌ చేపట్టాయ్. సొరంగం గుర్తించడంతో సరిహద్దుల్లో చొరబాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని సరిహద్దు కమాండర్లకు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ఆదేశించారు.

పంజాబ్‌లో ఇటీవల ఐదుగురు సాయుధులైన చొరబాటుదారులను భద్రతాదళాలు మట్టుబెట్టాయ్. దీంతో అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు మెగా డ్రైవ్‌ను చేపట్టాయి. ఇందులో భాగంగా జమ్మూలోని సాంబా సెక్టార్‌ పరిధిలో పెట్రోలింగ్‌ చేస్తుండగా ఈ సొరంగ మార్గాన్ని గుర్తించాయి. భారత్‌ వైపు 50 మీటర్లు వరకు ఉన్న ఈ సొరంగ మార్గం 25 మీటర్ల లోతు ఉంది. అందులో 8 నుంచి 10 ప్లాస్టిక్‌ ఇసుక సంచులను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై కరాచీ అని రాసి ఉంది. ఈ సొరంగానికి 400 మీటర్ల దూరంలో పాకిస్థాన్‌ సరిహద్దు పోస్ట్‌ ఉంది.

సొరంగం తవ్వకం వెనక కచ్చితంగా పాకిస్థాన్‌ హస్తం ఉందని బీఎస్‌ఎఫ్‌ ఐజీ ఎన్‌.ఎస్‌.జామ్వాల్‌ ఆరోపించారు. పొరుగు దేశానికి ఈ నిర్మాణం గురించి తెలుసునన్నారు. సొరంగాన్ని గుర్తించిన బలగాలను ఆయన ప్రశంసించారు. మరోవైపు సరిహద్దుల్లో సొరంగ మార్గాలను గుర్తించడంలో రాడార్ల సాయాన్ని తీసుకునే అవకాశాన్ని బీఎస్‌ఎఫ్‌ పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories