ఓ వ్యక్తికి వెబ్ సిరీస్ చూడడం ఉన్న పిచ్చి ఏకంగా 75 మంది ప్రాణాలను కాపాడింది.
ఓ వ్యక్తికి వెబ్ సిరీస్ చూడడం ఉన్న పిచ్చి ఏకంగా 75 మంది ప్రాణాలను కాపాడింది. వెబ్ సిరీస్ ఏంటి? ప్రాణాలను కాపాడడం ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇది చదవాల్సిందే మరి.. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని దొంబివిలి, కొపర్ ఏరియాకు చెందిన కునాల్ కి వెబ్ సిరీస్ అంటే పిచ్చి. వీపరితంగా వెబ్ సిరీస్ లను చూసే అలవాటు తనకి ఉంది. అతడు బుధవారం రాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు వెబ్ సిరీస్ చూస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలో తానుండే రెండస్థుల భవనంలోని ఓ భాగం కూలిపోవడం గమనించాడు కునాల్.. దీనితో వెంటనే అప్రమత్తం అయి నిద్రిస్తున్న తన కుటుంబంతో పాటుగా ఆ భవనంలో నివసిస్తున్న 75 మందిని నిద్ర లేపాడు. దీనితో అందరూ భయపడి బయటకు వచ్చారు. వారందరూ భయటకు వచ్చిన కొద్దిసేపటికి ఆ భవనం అందరూ చూస్తుండగానే పేక మెడ లాగా కుప్పకూలిపోయింది. కునాల్ కి ఉన్న సినిమాల పిచ్చే ఈ రోజు 75 మందిని కాపాడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
దీనితో ఇప్పుడు కునాల్ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి శిథిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు తొమ్మిది నెలల క్రితమే నోటీసులను అందజేశారు. అయితే తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో ఖాళీ చేయడానికి సుముఖత చూపలేదని అందులో ఉన్నవారు చెప్పుకొచ్చారు.
Maharashtra: 75 occupants of a 2-storey building in Kopar, Dombivli saved by a young boy as building collapsed on 29th Oct early morning.
— ANI (@ANI) October 30, 2020
"While watching web-series till dawn, I saw part of kitchen falling down & alerted everyone to vacate the building," says 18-yr old Kunal pic.twitter.com/p2b6qOMSr2
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire