శివసేన పార్టీ పోరులో కీలక పరిణామం

Both Parties Will Submit Documents to the Central Election Commission
x

శివసేన పార్టీ పోరులో కీలక పరిణామం

Highlights

Shiv Sena: కేంద్ర ఎన్నికల సంఘానికి పత్రాలు సమర్పించనున్న ఇరువర్గాలు

Shiv Sena: శివ‌సేన పార్టీ త‌మ‌దేన‌ని నిరూపించుకోవ‌డానికి మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ పోరులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. శివ‌సేన త‌మ‌దేన‌ని బ‌ల‌మైన వాద‌న వినిపించ‌డానికి ఇరు వ‌ర్గాలు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ప‌త్రాలు స‌మ‌ర్పించ‌నున్నాయి. ఆగ‌స్టు 8లోగా ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఎన్నిక‌ల సంఘం ఉద్ధ‌వ్ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండేకు సూచించింది. అలాగే, పార్టీలో విభేదాల‌పై కూడా వారిద్ద‌రు లిఖిత‌పూర్వ‌కంగా వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది.

త‌న‌కు 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీల‌ మ‌ద్ద‌తు ఉంద‌ని ఇప్ప‌టికే ఏక్‌నాథ్ షిండే ఎన్నిక‌ల సంఘానికి ఓ లేఖ‌లో వివ‌రించారు. శివ‌సేన చీలిపోయింద‌ని, ఆ పార్టీ త‌మ‌దేనని, తామే అధ్య‌క్షుల‌మ‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే అంటున్నార‌ని ఎన్నిక‌ల సంఘం ఇరు వ‌ర్గాల‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో శివ‌సేన ఎవ‌రిదో తేల్చేందుకు ప‌త్రాలు అడుగుతున్న‌ట్లు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories