Parliament: రాజకీయ రంగు పులుముకున్న పార్లమెంట్ ఘటన

Both BJP And Congress Comment On Each Other On The Incident That Happened In Parliament
x

Parliament: రాజకీయ రంగు పులుముకున్న పార్లమెంట్ ఘటన

Highlights

Parliament: పార్లమెంట్ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దాడి వెనక బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ దాడికి ప్రేరేపించిందని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

Parliament: పార్లమెంట్ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దాడి వెనక బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ దాడికి ప్రేరేపించిందని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పార్లమెంట్‌లో జరిగిన ఘటన భద్రతా ఉల్లంఘన ఉగ్రవాద చర్య అంటోన్న విపక్షాలు.. బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహాను విచారించాలని కోరుతున్నాయి. మరోవైపు నిందితురాలు నీలమ్‌ కాంగ్రెస్ మద్దతుదారు అంటోంది బీజేపీ. గతంలో జరిగిన రైతుల ఉద్యమంలో నీలమ్‌ పాల్గొందని., కాంగ్రెసే దాడి చేసేలా ప్రేరేపించిందిన కౌంటర్ ఎటాక్ చేస్తోంది.

ఇక ఈ కేసులో ‎ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది నెలల నుండి పార్లమెంట్‌పై దాడికి నిందితులు ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఈనెల 10న ఆరుగురు నిందితులు ఢిల్లీకి చేరుకున్నట్టు గుర్తించారు. వీరికి పార్లమెంట్ పాసులు సంపాదించడంలో మైసూర్‌కు చెందిన మనోరంజన్‌ కీలక పాత్ర పోషించాడు. గత నాలుగు సంవత్సరాలుగా ఆరుగురు నిందితులు పార్లమెంట్‌పై దాడి ప్రయత్నం చేస్తున్నారని...దీనికి కొద్దిరోజల ముందు పథకం వేశారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అదుపులో ఉన్న నిందితులను ఇవాళ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories