BookMyShow: కోల్డ్‌ప్లే కన్సర్ట్ టికెట్స్ సేల్‌కి ముందే క్రాష్ అయిన బుక్ మై షో... కోల్డ్‌ప్లేకు అంత భారీ డిమాండ్ ఎందుకు?

BookMyShow: కోల్డ్‌ప్లే కన్సర్ట్ టికెట్స్ సేల్‌కి ముందే క్రాష్ అయిన బుక్ మై షో... కోల్డ్‌ప్లేకు అంత భారీ డిమాండ్ ఎందుకు?
x
Highlights

BookMyShow Crashed: సాధారణంగా ఎవరైనా పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే.. థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్స్ కిక్కిరిసిపోతాయి. అలాగే ఆ సినిమా టికెట్స్...

BookMyShow Crashed: సాధారణంగా ఎవరైనా పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే.. థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్స్ కిక్కిరిసిపోతాయి. అలాగే ఆ సినిమా టికెట్స్ సేల్ చేసే వెబ్‌సైట్లలోనూ భారీ డిమాండ్ కనిపిస్తుంది. కానీ ఆ పోర్టల్స్ క్రాష్ అవడం అనేది పెద్దగా కనిపించదు. ప్రపంచవ్యాప్తంగా ఆ స్టార్ హీరో సినిమా రిలీజైనప్పటికీ.. వెబ్‌సైట్స్ క్రాష్ అయ్యేంత పరిస్థితి మాత్రం కనిపించదు. అలాంటిది తాజాగా కోల్డ్‌ప్లే ముంబై కన్సర్ట్‌కి టికెట్స్ సేల్ చేయడానికి కొద్దిముందుగానే బుక్ మై షో సైట్ క్రాష్ అయింది. ఇంకా చెప్పాలంటే కోల్డ్‌ప్లే షోకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఔను, వచ్చే ఏడాది జనవరి నెల 18, 19వ తేదీల్లో ఈ కోల్డ్‌ప్లే మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. ఆ షో కోసం నేటి నుండే బుక్ మై షో ద్వారా టికెట్స్ సేల్స్ మొదలుపెట్టారు. కానీ అంతకంటే ముందే టికెట్స్ బుక్ చేసుకునే వారి రద్దీ తట్టుకోలేక బుక్ మై షో సైట్ సర్వర్ క్రాష్ అయింది.

కోల్డ్‌ప్లే ముంబై కన్సర్ట్ అంటే ఎందుకంత క్రేజీ..

రాక్ మ్యూజిక్ అంటే చెవులు కోసుకునేవారికి కోల్డ్‌ప్లే ముంబై కన్సర్ట్ వేదిక ఒక భూతల స్వర్గం లాంటిది. 2025 జనవరి 18, 19 తేదీలలో రాక్ మ్యూజిక్ లవర్స్ అయిన భారతీయులను ఈ లైవ్ మ్యూజిక్ షో ఉర్రూతలూగించనుంది. బ్రిటీష్ కి చెందిన ప్రముఖ రాక్ బ్యాండ్ ఈ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ని హోస్ట్ చేయనుంది. ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కోల్డ్‌ప్లే ముంబై కన్సర్ట్ షోలో అక్కడికి వచ్చిన ప్రేక్షకులను వెస్టెర్న్ రాక్ మ్యూజిక్‌తో ఎంటర్‌టైన్ చేయనున్నారు.

8 ఏళ్ల తరువాత ఇండియాకు..

కోల్డ్ ప్లే ముంబై కన్సర్ట్ కోసం ఇక్కడి ఆడియెన్స్ గత 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అప్పటి నుండి ఊరిస్తూ వచ్చిన షో కావడం వల్లే ఆలస్యం చేస్తే టికెట్స్ అయిపోతాయేమోననే భయంతో ఆడియెన్స్ ఇప్పటి నుండే టికెట్స్ కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. అంతేకాకుండా ఈసారి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ మరింత ప్రత్యేకంగా ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.

సూపర్ హిట్ ఆల్బమ్స్ మ్యూజిక్ ఆఫ్ ది స్పేర్స్, అలాగే కొత్తగా వచ్చిన వీ ప్రే, ఫీల్స్ లైక్ ఐయామ్ పాలింగ్ ఇన్ లవ్ వంటి ట్రాక్స్‌ని ఇక్కడ పాడి సందడి చేయనున్నారు. ఇవే కాకుండా క్లాసిక్స్‌గా పేరున్న యోల్లో, ఫిక్స్ యూ వంటి ఆల్బమ్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఈవెంట్లో పాటలంతా ఒక ఎత్తయితే... ఆ రాక్ మ్యూజిక్‌ని మ్యాచ్ చేస్తూ వెనకాల ప్లే అయ్యే ఫైర్‌వర్క్స్, లేజర్ లైట్స్, ఎలిఈడీ డిస్‌ప్లే లాంటివి అదనపు హంగులు కానున్నాయి. అందుకే రాక్ మ్యూజిక్ లవర్స్‌కి ఈ కోల్డ్‌ప్లే ముంబై కన్సర్ట్ ఓ మ్యూజిక్ ఫెస్టివల్ కానుంది. సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా ప్రముఖులు.. వారి పిల్లలు ఈ షోలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు విపరీతంగా పోటీపడుతుంటారు. అందుకే కోల్డ్‌ప్లే ముంబై కన్సర్ట్‌కి అంత భారీ క్రేజ్.

Show Full Article
Print Article
Next Story
More Stories