బాంబే హైకోర్టులో న‌టి కంగ‌నాకు ఊరట.. కూల్చివేత ఆపండి..

బాంబే హైకోర్టులో న‌టి కంగ‌నాకు ఊరట.. కూల్చివేత ఆపండి..
x
Highlights

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కార్యాలయాన్ని బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) సిబ్బంది బుధవారం కూల్చిన విషయం తెలిసిందే..

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కార్యాలయాన్ని బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) సిబ్బంది బుధవారం కూల్చిన విషయం తెలిసిందే. ఈ ఆఫీస్ ముంబైలోని పాలి హిల్స్‌లో ఉంది. అయితే.. బాంద్రా బంగ్లాలో అక్రమంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. ఆ ఇంటికి సంబంధించి కంగనకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. అయితే తాజాగా మహారాష్ట్ర హైకోర్టు కంగనాకు ఊరట కలిగించేలా తీర్పు ఇచ్చింది. కూల్చివేతను ఆపాలని బొంబాయి హైకోర్టు బిఎంసిని ఆదేశించింది.. అలాగే ఆమె పిటిషన్‌పై స్పందించాలని బీఎంసీకి సూచించింది. ఈ విషయంపై రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగనుంది.

ముంబై పౌరసంఘం తన కార్యాలయంలో 'అక్రమ నిర్మాణం' కోసం జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ కంగనా కోర్టును ఆశ్రయించారు.. కూల్చివేత ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. తన పాలి హిల్ కార్యాలయంలోని భాగాలను కూల్చివేస్తున్నట్లు చూపించే బిఎంసి అధికారుల చిత్రాలను పంచుకున్న ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పాకిస్థాన్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలావుంటే నటి కంగన, కొందరు శివసేన నాయకుల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంగన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై శివసేన నేతలు కూడా ఫైర్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories