వ్యభిచారం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

వ్యభిచారం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
x
Highlights

హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వ్యభిచారం చేయడం నేరమని ఏ చట్టంలోనూ లేదని, తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు మహిళలకు ఉందని

బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వ్యభిచారం చేయడం నేరమని ఏ చట్టంలోనూ లేదని, తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు మహిళలకు ఉందని వ్యాఖ్యానించింది. వారి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నిర్బంధం విధించడం సరైంది కాదని పేర్కొంటూ.. ఈ సందర్బంగా ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించింది హైకోర్టు. ఈ మేరకు జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ మానవ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 వ్యభిచారం కేసులో పట్టుబడిన ముగ్గురు మహిళలను మహిళల హాస్టల్‌కు తరలించమని దిగువ కోర్టు ఆదేశించడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది. పీఐటీఏ-1956లో వ్యభిచారాన్ని రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదని.. ఇటువంటి కేసులలో పట్టుబడినవారిని శిక్షించాలన్న నిబంధన కూడా ఏమి లేదని స్టిస్‌ చవాన్‌ వ్యాఖ్యానించారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ముగ్గురు యువతులు 2019 లో మలాద్‌లోని ఓ గెస్ట్‌హౌజ్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో పట్టుబడ్డారు. దాంతో వారిని బాధితులని పేర్కొంటూ, విటుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన దిందోషి సెషన్స్‌ కోర్టు, వారిని మహిళలను హాస్టల్ కు తరలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే సదరు యువతులు హైకోర్టును ఆశ్రయించారు.. ఈ సందర్బంగా తమకు విముక్తి కల్పించాలని అభ్యర్ధించారు. తమ సామాజికవర్గం వారిలో కొందరు ఇదే వృత్తిలో ఉన్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కోర్టు ఆ ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించింది. ఈ సందర్బంగా తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు మహిళలకు ఉందని వ్యాఖ్యానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories