Bomb threats: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు..!

Bomb threats: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు..!
x
Highlights

Bomb threats: ముంబైలోని జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కెఇఎమ్ హాస్పిటల్, జెజె హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పాటు ముంబైలోని హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్‌కు కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Bomb threats:ముంబైలోని ఆసుపత్రులపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కెఇఎమ్ హాస్పిటల్, జెజె హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం ఇస్తూ ముంబై పోలీసులు తెలిపారు. జూన్ 17న VPN నెట్‌వర్క్‌ని ఉపయోగించి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మెయిల్ పంపిన వ్యక్తి ఎవరు..బెదిరింపుల వెనకున్న ఉద్దేశ్యం ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. కాగా బెదిరింపు ఇమెయిల్‌లు అన్నీ ఒకే ID నుండి వచ్చాయని.. Beeble.com. ఈ వెబ్‌సైట్ సర్వర్ సైప్రస్‌లో ఉందని తెలిపారు. ఆసుపత్రి బెడ్‌కింద, బాత్‌రూమ్‌లో బాంబులు పెట్టామని మెయిల్‌లో బెదిరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్‌కు ముప్పు:

అటు ముంబైలోని హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్‌కు ఒక ఇమెయిల్ వచ్చింది. కాలేజీలో బాంబు పెట్టినట్లు మెయిల్ లో పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పరిశీలించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ముంబయిలోని వీపీ రోడ్‌ పీఎస్‌ దీనిపై విచారణ జరుపుతోంది.

అటు నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌పై కూడా బాంబు పేలుస్తామని బెదిరించారు. నాగ్‌పూర్ విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపుతో కూడిన ఇ-మెయిల్ వచ్చింది. దాని తర్వాత క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు. బెదిరింపు మెయిల్‌ను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపుతో కూడిన ఇ-మెయిల్ వచ్చింది. అది మధ్యాహ్నం 2:00 గంటలకు నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందింది. ఇ

దేశంలోని ఇతర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో క్షుణ్ణంగా విచారణ జరిపినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. 24 గంటలపాటు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories