ఒక్కరోజే 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్.. హడలెత్తిపోతున్న ఎయిర్‌లైన్స్ కంపెనీలు

ఒక్కరోజే 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్.. హడలెత్తిపోతున్న ఎయిర్‌లైన్స్ కంపెనీలు
x
Highlights

Bomb Threats For Flights: ఒక్కరోజే 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ...

Bomb Threats For Flights: ఒక్కరోజే 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ వంటి ఎయిర్ లైన్స్‌కి చెందిన 32 విమానాలకు శనివారం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇందులో అత్యధికంగా విమానాలు వాటి గమ్యస్థానాల్లో ల్యాండ్ అయిన తరువాతే కాల్స్ వచ్చాయి. దీంతో ఎక్కడికక్కడ విమానాశ్రయం సిబ్బంది ఆయా విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే మళ్లీ రన్‌వే ఎక్కించారు.

ఢిల్లీ నుండి లండన్ బయల్దేరిన విస్తార UK 17 ఫ్లైట్ మాత్రం టేకాఫ్ అయిన తరువాత బెదిరింపులు రావడంతో ఆ విమానాన్ని ముందుగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు. అక్కడ రెండు గంటల పాటు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. తనిఖీల అనంతరం ఆ విమానం లండన్ బయల్దేరింది.

ఇలా ఒక్కరోజే 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం అనేది ఇదే తొలిసారిగా ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బెదిరింపులలో కొన్ని ఫోన్ కాల్ ద్వారా వస్తే ఇంకొన్ని సోషల్ మీడియా ద్వారా, ఈమెయిల్ ద్వారా వచ్చాయి. కానీ అవన్నీ కూడా బూటకపు బెదిరింపుల్ కాల్స్ అని తనిఖీలు చేసిన తరువాతే తేలింది. నిత్యం వరుస బాంబు బెదిరింపు కాల్స్ వస్తుండటం, తనిఖీలతో గంటల తరబడి సమయం వృథా అవుతుండటం ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీని నష్టాల్లోకి తీసుకెళ్తుందని ఇండస్ట్రీకి సంబంధించిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వరుస బెదిరింపుల నేపథ్యంలో పౌరవిమానయానం భద్రతా మండలి డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ శనివారం అన్ని ఎయిర్ లైన్స్ కంపెనీల సీఈఓలతో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రోటోకాల్స్ అన్ని పాటిస్తున్నామని అన్నారు. విమానాయాన ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా విమానాల్లో ప్రయాణించవచ్చని హసన్ భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories