Rhea Chakraborty : డ్రగ్స్‌ కేసు: ఏ క్షణమైనా రియా అరెస్ట్ ?

Rhea Chakraborty : డ్రగ్స్‌ కేసు: ఏ క్షణమైనా రియా అరెస్ట్ ?
x

rhea Chakraborty

Highlights

Rhea Chakraborty : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్

Rhea Chakraborty : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ను ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ప్రధాన అనుమానితురాలు గా ఉన్న రియా చక్రవర్తికి నార్కోటిక్స్ కంట్రోలర్ బ్యూరో అధికారుల నోటీసులు జారీ చేశారు. దీనితో విచారణకు హాజరయ్యేందుకు ఆమె ముంబాయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుంది. అటు రియా చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వినిపిస్తోంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి చుట్టూ ఇప్పుడు ఉచ్చుబిగుస్తోందనే చెప్పాలి.

బాలీవుడ్‌తో పెనవేసుకుపోయిన డ్రగ్స్‌ మాఫియా చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ని ఎన్‌సీబీ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేయడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ తీగలాగితే డొంక కదలినట్టుగా బయటకొస్తోంది. ఈ మాదక ద్రవ్యాల రవాణాలో పెద్దచేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోన్న క్రమంలో అనూహ్యమైన విషయాలెన్నో బయటపడుతున్నాయని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సౌత్‌ వెస్ట్‌ రీజియన్‌ ముత్తా అశోక్‌ జైన్‌ మీడియాకి వెల్లడించారు. విచారణలో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సంచలన విషయాలను బయటపెట్టారని, రియా చక్రవర్తి చెపితేనే మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్‌ వెల్లడించినట్లు అధికారులు ప్రకటన చేశారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్‌ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని షోవిక్‌ విచారణలో ఒప్పుకున్నట్టుగా వెల్లడించారు.

రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్‌ డేటా ఆధారంగా ఎన్‌సీబీ నిర్ధారణకు వచ్చింది. నేడు రియాను విచారణలో , ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. షోవిక్‌తో పాటు ఇప్పటికే అరెస్టయిన వారిని రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్‌సీబీ అధికారి అశోక్‌ జైన్‌ ప్రకటన చేశారు.. డ్రగ్‌ సిండికేట్‌లో షోవిక్‌ను భాగస్వామిగా గుర్తించిన ఎన్‌సీబీ అతను ఇంత భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఎలా సేకరించాడనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories