గోవిందాకు తృటిలో తప్పిన ప్రమాదం.. కాలిలోకి దిగిన బుల్లెట్

Bollywood Actor Govinda Accidentally Gun Shot His Left Leg
x

గోవిందాకు తృటిలో తప్పిన ప్రమాదం.. కాలిలోకి దిగిన బుల్లెట్

Highlights

బాధతో కూడిన గొంతుతో మాట్లాడిన గోవిందా ఆ ఆడియోలో తన అభిమానులు, తల్లితండ్రులు, గురువు ఆశీస్సులో తనను కాపాడాయని చెప్పారు.

బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ గాయమైంది. ఆయన లైసెన్స్‌డ్ గన్ మిస్ ఫైర్ కావడంతో మోకాలిలో బులెట్ దిగి గాయమైంది. ఆ వెంటనే ఆయనను ముంబయిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని కుదుటపడిన తరువాత గోవిందా ఒక ఆడియో క్లిప్ విడుదల చేశారు. అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని చెప్పారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

బాధతో కూడిన గొంతుతో మాట్లాడిన గోవిందా ఆ ఆడియోలో తన అభిమానులు, తల్లితండ్రులు, గురువు ఆశీస్సులో తనను కాపాడాయని చెప్పారు. ‘నాకు బులెట్ గాయమైంది. దాన్ని బయటకు తీశారు. అందుకు డాక్టర్లకు ధన్యవాదాలు’ అని కూడా 60 ఏళ్ళ గోవిందా చెప్పారు.

శివసేన నాయకుడు కూడా అయిన గోవిందా మంగళవారం ఉదయం కోల్‌కతా ఫ్లైట్ కోసం ఎయిర్‌పోర్టుకు బయలుదేరడానికి రెడీ అవుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఉదయం 4.45 గంటల ప్రాంతంలో గన్ పొరపాటున పేలడంతో ఆయన మోకాలిలోకి బులెట్ దిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఒంటరిగానే ఉన్నట్లు తెలిసింది.

గోవిందా తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను అల్మరా నుంచి తీస్తున్నప్పుడు అది కిందపడి పేలిందని ఆయన మేనేజర్ శశి సిన్హా చెప్పారు. అప్పుడు ఆయన మోకాలి కింది భాగంలోకి బులెట్ దూసుకుపోయిందని చెప్పారు.

దాంతో, జుహూ ప్రాంతంలోని గోవిందా ఇంటికి వెంటనే చేరుకున్న పోలీసులు ఆయనను దగ్గర్లోని క్రిటికేర్ హాస్పిటల్లోచేర్పించారు. గోవిందా మరో రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాలని డాక్టర్లు చెప్పారు.

అయితే, ఈ విషయంలో గోవిందా తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories