Delhi: దిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో పేలుడు

Blast Near Israel Embassy in Delhi
x

Delhi: దిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో పేలుడు

Highlights

Delhi: రాయబారిని దుర్భాషలాడుతూ లేఖ లభ్యం

Delhi: పొగమంచుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశరాజధాని ఢిల్లీ తాజాగా పేలుడుతో ఉలిక్కిపడింది. దిల్లీ లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. రాయబార కార్యాలయం ఆవరణ వెనుకవైపు పేలుడు జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌ రాయబారిని తిడుతూ ఇంగ్లీష్‌లో రాసిన ఒక పేజీ లేఖను పోలీసులు గుర్తించారు. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.

పేలుడు ఘటనను ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ధృవీకరించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం లోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌ఐఏ బృందం కూడా పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. పేలుడు ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఎంబసీ దగ్గర భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories