BJP: సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ సమీక్ష

BJP Review on General Elections
x

BJP: సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ సమీక్ష

Highlights

BJP: ఐదు దశల్లో ఎన్ని స్థానాలు గెలుస్తామని ఆరా

BJP: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకూ ఐదు దశల్లో పోలింగ్ ముగిసిన 428 స్థానాల్లో ఎన్ని సీట్లు సాధించగలమనే అంశంపై బీజేపీలు నేతలు చర్చలు జరిపారు. జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల వారిగా...బీజేపీ సాధించబోయే ఫలితాలను వారు అంచనా వేసినట్టు సమాచారం.

ఎన్డీయే గతంలో భారీ విజయాలు సాధించిన బిహార్, మహారాష్ట్రలో ఈ సారి వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటోందని పార్టీ వర్గాల్లోనే టాక్ ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో 41 స్థానాలు గెలుచుకోగా.. ఈ సారి శివసేన దూరం కావడంతో బీజేపీకి 20సీట్లు కూడా కష్టమని అంచనాలు వినబడుతున్నాయి. ఇక బిహార్‌లో మొత్తం 40 స్థానాల్లో గతంలో ఎన్డీయే కూటమి 39స్థానాలు గెలుచుకుంది. ఈ సారి సగం సీట్లు కూడా దక్కడం కష్టమనే అంచనాలున్నాయి.

పస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే సంఖ్యా బలం 342. బీజేపీ చెబుతున్నట్లుగా 400సీట్లు సాధించుకోవాలంటే...మరో 58 సీట్లు కావాలి. ఇందులో పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని 63సీట్లలో బీజేపీ 90శాతం సీట్లు సాధించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ 21సీట్లలో 8సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరో నాలుగు సీట్లు అదనంగా గెలుచుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 42సీట్లలో 2019లో 18సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి రెట్టింపు స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్‌లో ఎన్డీయే గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లు సాధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన 115 స్థానాల్లో బీజేపీ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే దిశగా వ్యూహాలు సిద్ధం చేయాలని నిన్నటి సమావేశంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories