MP Subramanian Swamy on Dhoni: దాదాపుగా 16ఏళ్ళుగా టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ నిన్న
MP Subramanian Swamy on Dhoni: దాదాపుగా 16ఏళ్ళుగా టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ నిన్న (ఆగస్టు 15)న తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.. దీంతో ఫ్యాన్స్ తో పాటుగా యావత్ దేశం షాక్‌కు గురైంది. వాస్తవానికి గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. ఇక ఎవరు ఉహించిన విధంగా నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు..
అయితే ధోని 2024 ఎన్నికల్లో పోటి చేయలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. " ధోని కేవలం క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు. కానీ మిగిలిన వాటి నుంచి కాదు. తన టాలెంట్ తో అసమానతలపై పోరాడగలడు.. క్రికెట్ జట్టులో అతను ప్రదర్శించిన స్పూర్తిదాయక నాయకత్వం ప్రజా జీవితంలో కూడా అవసరం అవుతుంది. ధోని 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోరాడాలి" అని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఇక అటు ధోని కూడా ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వస్తాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..
M. S. Dhoni is retiring from Cricket but not from anything else. His talent-to be able to fight against odds and his inspiring leadership of a team that he has demonstrated in cricket is needed in public life. He should fight in LS General Elections in 2024.
— Subramanian Swamy (@Swamy39) August 16, 2020
ధోనీ.. కెప్టెన్‌గానూ 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire