Ahmadabad: నేడు అహ‍్మదాబాద్‌లో బీజేపీ శాసససభాపక్ష సమావేశం

BJP Legislative Assembly in Ahmadabad Today
x

గుజరాత్ శాసనసభ అసెంబ్లీ (ఫైల్ ఫోటో )

Highlights

Ahmadabad: గుజరాత్ కొత్త సీఎంను ఎన్నుకోనున్న బీజేపీ ఎమ్మెల్యేలు * పరిశీలకులుగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తరుణ్

Ahmadabad: గుజరాత్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతుంది. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించే పాలకుడి కోసం బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. అందుకు గానూ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గుజరాత్ కొత్త సీఎంని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా చూసుకునేందుకు పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఇప్పటికే గుజరాత్‌కు చేరుకున్నారు. రాష్ట్ర సీనియర్‌లతో భేటీ అయ్యారు. సీనియర్ల అభ్యర్థత్వంపై సీనియర్ నేతల అభిప్రాయాలను తెలుసుకుని కేంద్రానికి వివరించనున్నారు.

నూతన ముఖ్యమంత్రి ఎన్నిక సాఫీగా జరిగేలా కేంద్రం నాయకత్వం జాగ్రత్తలు వహిస్తుంది. గుజరాత్ సీఎంగా తనదైన ముద్ర వేసుకున్న నరేంద్రమోడీ తన వారసుడి ఎంపిక కోసం పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అంతేకాదు పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ అధిష్టానం విజయ్ రూపానీతో రాజీనామా చేయించిందనే వాదనలు వినిపిస్తు్న్నాయి. ప్రధాని మోడీ ఆశీస్సులు ఉన్న వ్యక్తే తదుపరి గుజరాత్ నూతన సీఎం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది వరకు అలాగే జరగడంతో ఇప్పుడు అదే ఫాలో అవుతన్నారు 2017 ఎన్నికల కంటే ముందు కూడా 2016లో ముఖ్యమంత్రిని మార్చింది బీజేపీ 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ను మార్చి ఆమె స్థానంలో విజయ్ రూపానీని నియమించింది కేంద్ర నాయకత్వం ప్రస్తుతం విజయ్ రూపానీ స్థానంలో మరొకరికి పట్టం కట్టింది. 2016 ఫార్మూలాను మరోసారి బీజేపీ అమలుపరుస్తున్నట్టు తెలుస్తోంది

తదుపరి సీఎం రేసులో ఉన్న వారిలో ప్రధాని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కు ప్రధాని ఆశీస్సులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పలు సమావేశాల్లో కేంద్ర మంత్రి పనితీరును ప్రధాని మోడీ ప్రశంసించారు. గుజరాత్ మెజారిటీ వర్గంగా ఉన్న పటేదార్ సామాజిక వర్గానికి సీఎం అవకాశం ఉంది గుజరాత్‌లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 60కిపైగా నియోజకవర్గంలో ప్రభావం చూపనుంది ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, ఎంపీ సీఆర్ పటేల్ ఉన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories