BJP: ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల భేటీ .. జేపీ నడ్డా అధ్యక్షతన జరగనున్న సమావేశం

BJP Central Election Committee Meeting Today
x

BJP: ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల భేటీ .. జేపీ నడ్డా అధ్యక్షతన జరగనున్న సమావేశం

Highlights

BJP: తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

BJP: రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. మూడో జాబితాపై బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ కేంద్రం ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు హాజరుకానున్నారు.

సీఈసీ భేటీలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది. మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నిన్న బీజేపీలో ప్రధాన కార్యాలయంలో పది రాష్ట్రాలకు చెందిన కోర్‌ కమిటీ నేతలతో జేపీ నడ్డా, అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories