కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి!

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి!
x
Highlights

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేలాదికేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. కరోనా కాటుకు మరో..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేలాదికేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. కరోనా కాటుకు మరో ఎమ్మెల్యే బలయ్యారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒడిశా ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి (65) తిరిగి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు భార్య ప్రతివా, కుమారుడు రుద్ర ప్రతాప్, కుమార్తె పల్లవి ఉన్నారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పూరి జిల్లాలోని పిపిలికి చెందిన మహారథి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేశం అత్యవసర సమయంలో మిసా (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద ఆయనను అరెస్టు అయ్యారు. మహారధికి సెప్టెంబర్ 14 న COVID-19 పాజిటివ్ అని తేలింది.. వారం రోజుల చికిత్స అనంతర ఆయన కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు, కాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు.

ఈ క్రమంలో శుక్రవారం నుండి వెంటిలేటర్ మీద ఉన్నారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. పూరిలోని ఎస్సీఎస్ కళాశాలలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు మహారథి. 1985 లో జనతాదళ్లో చేరి పిపిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే 2000వ సంవత్సరంలో నవీన్ పట్నాయక్ సారథ్యంలో ఏర్పాటైన బిజు జనతాదళ్‌లో చేరారు. 2011 లో నవీన్ పట్నాయక్ క్యాబినెట్లో వ్యవసాయం, మత్స్య, పంచాయతీ రాజ్ మరియు తాగునీటి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో ఒడిశాకు వరుసగా నాలుగు సంవత్సరాలు కృషి కర్మన్ అవార్డు లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories