Bird Flu: వామ్మో.. మనుషులకు బర్డ్ ఫ్లూ !

Bird Flu in humans recognised in Russia
x

బర్ద్ ఫ్లూ (ప్రతీకాత్మక చిత్రం: హాన్స్ ఇండియా0

Highlights

దక్షిణ రష్యాలోని ఒక పౌలీ్ట్రీ ఫామ్‌లో పనిచేసే ఏడుగురికి బర్డ్ ఫ్లూ సోకినట్లు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇపుడిపుడే కరోనా నుండి తేరుకుంటున్న ప్రపంచానికి మరో పిడుగులాంటి వార్తను రష్యా వెల్లడించింది. అదేంటో తెలుసా మానవుల్లో బర్డ్ ఫ్లూ కేసును రష్యాలో గుర్తించారు.ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌లోని H5N8 స్ట్రెయిన్‌ను వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్డ్‌ఫ్లూకు కారణమయ్యేది ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసును గుర్తించారని.. ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ స్ట్రెయిన్ H5N8 హ్యూమన్ ఇన్‌ఫెక్షన్‌‌కు సంబంధించిన తొలి కేసు అని వినియోగదారుల హక్కుల రక్షణ వాచ్‌డాగ్ రెస్పోట్రెబ్నాడ్జర్ హెడ్ అన్నా పొపోవా తెలిపారు.

పక్షుల్లో చాలా ప్రమాదకరమైన వ్యాధి అయిన ఇది ఇప్పటి వరకు మానవుల్లో కనిపించిన దాఖలాలు కనిపించలేదు. దక్షిణ రష్యాలోని ఒక పౌలీ్ట్రీ ఫామ్‌లో పనిచేసే ఏడుగురికి ఈ స్ట్రెయిన్‌ సోకినట్లు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెక్టర్‌ లేబొరేటరీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ ఏడుగురిలో 'హెచ్‌5ఎన్‌8' జన్యుపదార్థం జాడ ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. తేలికపాటి బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ సోకడంతో వారిలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని.. స్వల్ప చికిత్సతో త్వరగానే కోలుకున్నారని తెలిపింది. మనుషుల నుంచి మనుషులకు 'హెచ్‌5ఎన్‌8' సోకడం లేదని స్పష్టం చేసింది. 2020 డిసెంబరులో ఇదే పౌలీ్ట్ర ఫామ్‌లోని కోళ్లకు బర్డ్‌ ఫ్లూ ప్రబలిన విషయాన్ని రష్యా ఆరోగ్యశాఖ గుర్తు చేసింది. ఈ వివరాలన్నీ డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు తెలిపింది. ''మనుషుల్లో 'హెచ్‌5ఎన్‌8' బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ గుర్తింపు ప్రమాద హెచ్చరిక. భవిష్యత్తులో ఆ వైరస్‌ స్ట్రెయిన్‌ మరిన్ని జన్యుమార్పులకు గురై ప్రబలితే ఎలా స్పందించాలో నిర్ణయించుకునేందుకు ప్రపంచానికి తగిన సమయం దొరికింది. ఈ ఇన్ఫెక్షన్‌ నిర్ధారణకు పరీక్షలు, నివారణకు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టే వీలు కలిగింది'' అని రష్యా ప్రజారోగ్య విభాగం చీఫ్‌ 'స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories