బీహార్ లో 27 మంది పోటీ చేయడానికి అనర్హులు.. ఏపీలో షాకింగ్ నంబర్..

బీహార్ లో 27 మంది పోటీ చేయడానికి అనర్హులు.. ఏపీలో షాకింగ్ నంబర్..
x
Highlights

బీహార్ లో 27 మంది పోటీ చేయడానికి అనర్హులు.. ఏపీలో షాకింగ్ నంబర్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలోని 27 మంది పొలిటికల్ లీడర్లకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈ 27 మంది పోటీ చేయడానికి అనర్హులను చెప్పింది. ఈ అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం అన్ని జిల్లాలకు పంపింది. ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 10 (ఎ) ప్రకారం వీరు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించబడ్డారు. వీరంతా 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినవారు అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందులో కుధాని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకంగా 5 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలలో నిషేధించబడిన వ్యక్తుల సంఖ్య ఆధారంగా, బీహార్ 8 వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో గరిష్టంగా 332 మందిని నిషేధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 124 , కేరళ 111 , కర్ణాటక 80 , అస్సాం 49 , తెలంగాణ 47 , ఉత్తరాఖండ్ 40 , బీహార్, గుజరాత్లలో 27 మంది ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని తేల్చారు.

అయితే సెప్టెంబరు నెలలో 62 మంది నిషేధం నుండి విముక్తి పొందారు.. 2020 జనవరి నాటికి బీహార్‌లో 89 మంది ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. వీరిలో 62 మందికి మూడేళ్ల నిషేధ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముగిసింది. ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 10 (ఎ) ప్రకారం, ఒక వ్యక్తి ఎన్నికల ఖర్చుల వివరాలను ఫలితం ఇచ్చిన 30 రోజులలోపు ఇవ్వకపోతే లేదా వివరాలు ఇవ్వకపోవటానికి ఎటువంటి సహేతుకమైన కారణం లేదా సమర్థన ఇవ్వకపోతే, కమిషన్ అతనికి మూడేళ్ల నిషేధ కాలపరిమితిని విదిస్తుంది. దీంతో వారు మూడేళ్లవరకు ఎటువంటి ఎన్నికలలో పోటీచేయలేరు.. ఈ నిబంధన ఆధారంగా బీహార్ లో 27 మందిని మూడేళ్లపాటు నిషేధించింది ఎన్నికల సంఘం.

Show Full Article
Print Article
Next Story
More Stories