బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం

బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం
x
Highlights

బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. 17 జిల్లాల్లోని 94నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 18వేల 823 పోలింగ్ కేంద్రాలు, 41వేల 362...

బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. 17 జిల్లాల్లోని 94నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 18వేల 823 పోలింగ్ కేంద్రాలు, 41వేల 362 బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 2 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశ పోటీలో వెయ్యి 463 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 13 వందల 16మంది పురుషులు కాగా 146 మహిళల అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనల మధ్య పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ ముందుగానే శానిటైజ్ చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఓటర్లను అనుమతిస్తున్నారు. ప్రతీ కేంద్రం దగ్గర శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. చివరి దశ ఎన్నికలు ఈ నెల 7న జరగనుండగా 10న ఫలితాలు వెలువడనున్నాయ్.

రెండో దశ పోలింగ్ లో విపక్ష కూటమి తరపున 56 స్తానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్ మరికొన్ని స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అధికార ఎన్డీయే నుంచి బీజేపీ 46 స్థానాల్లో, జేజీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎల్జెపీ 52 సీట్లలో అభ్యర్ధులను నిలిపింది. మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 27మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రాఘోపూర్ నియోజకవర్గం నుంచి మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ ఆయన సోదరుడు తేజ్‌పాల్ యాదవ్ హసన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అటు శత్రఘ్నుసిన్హా కుమారుడు లవ్ సిన్హా జేడీయూ నేత చంద్రికారాయ్, బీజేపీ నాయకుడు నంద కిశోర్ యాదవ్ బరియార్‌పూర్ నుంచి జేడీయూ అభ్యర్థి మంజూ వర్మ భవిష్యత్‌ను ఓటర్లు నిర్ణయించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories