Nithish Kumar: మోడీ సర్కార్‌కి భారీ షాకిచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

Bihar CM Nitish Kumar gave a huge shock to the Modi government
x

Nithish Kumar: మోడీ సర్కార్‌కి భారీ షాకిచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

Highlights

Nithish Kumar: బిహార్‌కి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్

Nithish Kumar: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్‌ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బీహార్‌ ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా, బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

న్యాయపర పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది. మరోవైపు జేడీయూ కీలక సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్‌ నేత మీడియాతో మాట్లాడారు. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని తెలిపిరు. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories